hyderabadupdates.com movies రోహిత్ కోహ్లీ.. ఇద్దరికీ నెక్ట్స్ బిగ్ ఛాలెంజ్ ఇదే!

రోహిత్ కోహ్లీ.. ఇద్దరికీ నెక్ట్స్ బిగ్ ఛాలెంజ్ ఇదే!

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ముగిసింది. భారత్ 1-2 తేడాతో సిరీస్ కోల్పోయినప్పటికీ, అభిమానులకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఫామ్‌లోకి రావడం పెద్ద ఊరట. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్న ఈ సీనియర్ ప్లేయర్లు, తమ బ్యాటింగ్‌తో సిడ్నీలో అద్భుత ప్రదర్శన ఇచ్చి టీమ్‌కు విజయాన్ని అందించారు. అయితే, ఇప్పుడు వీరు మళ్లీ ఎప్పుడు మైదానంలో కనిపిస్తారు, 2027 ప్రపంచకప్‌ లక్ష్యంగా తమ ఫిట్‌నెస్, ఫామ్‌ను ఎలా కొనసాగించుకుంటారు అనేదే అసలు చర్చ.

ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ స్వదేశానికి తిరిగి వచ్చినా, రాబోయే రోజుల్లో వారికి విశ్రాంతి కంటే ఎక్కువ పని ఉంది. టీమిండియా మేనేజ్‌మెంట్ ఇచ్చిన సూచన ప్రకారం, కేవలం వన్డేల్లో ఆడుతున్న ఈ ఇద్దరు దేశవాళీ మ్యాచ్‌లలో కూడా పాల్గొనడం తప్పనిసరి. ఈ క్రమంలో, త్వరలో మొదలయ్యే రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు వారికి ఒక మంచి అవకాశం. నవంబర్ 1 నుంచి ముంబై, ఢిల్లీ జట్ల మ్యాచ్‌లు ఉండగా, వీరిద్దరూ ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తే, వారికి బ్యాటింగ్ ప్రాక్టీస్‌తో పాటు టోర్నీకి కూడా కొత్త కళ వస్తుంది.

వచ్చే నెల చివరి నుంచి దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, ఆ తర్వాత జనవరిలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లు ఉన్నాయి. ఈ కీలకమైన అంతర్జాతీయ మ్యాచ్‌లకు సిద్ధంగా ఉండటానికి వీరికి దేశవాళీ క్రికెట్ చాలా అవసరం. ముఖ్యంగా, డిసెంబర్, జనవరి మధ్యలో జరిగే విజయ్ హజారే ట్రోఫీ కూడా ఉంది. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్‌ల మధ్యలో ఈ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్‌లలో వీరు కచ్చితంగా ఆడాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.

కోహ్లీ, రోహిత్ 2027 వరల్డ్ కప్ ఆడతారా లేదా అనే చర్చను పక్కన పెడితే, వాళ్లు ఆ టోర్నమెంట్‌కు జట్టులో ఉండాలంటే, ఇప్పుడు తమ ఫిట్‌నెస్‌ను, ఫామ్‌ను ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాలి. టెస్ట్, టీ20 ఫార్మాట్లలో ఆడటం లేదు కాబట్టి, కేవలం వన్డేలు ఆడుతున్న వీరికి దేశవాళీ మ్యాచ్‌లలో పాల్గొని టచ్‌లోనే ఉండటం అత్యవసరం. మాజీలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు.

రాబోయే వన్డే సిరీస్‌ల షెడ్యూల్‌ను చూస్తే, ఈ ఇద్దరు సీనియర్లు వరుసగా కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌లలో ఆడాల్సి ఉంది. నవంబర్ 30న రాంచీలో సౌత్ ఆఫ్రికాతో తొలి వన్డే మొదలై, డిసెంబర్ 6న వైజాగ్‌లో మూడో వన్డేతో ముగుస్తుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి సిరీస్ మొదలవుతుంది. ఈ బిజీ షెడ్యూల్‌లో ఏమాత్రం ఫిట్‌నెస్ తగ్గినా, తుది జట్టులో చోటు దక్కడం కష్టమవుతుంది. రోహిత్, కోహ్లీ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నందున, వారి ప్రదర్శనపై సెలెక్టర్ల దృష్టి పదునుగా ఉంటుంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో మంచి ఫామ్‌ను కొనసాగించినట్లే, ఈ రాబోయే సిరీస్‌లలో కూడా నిరూపించుకోవాలి. లేదంటే, యువ ఆటగాళ్లకు దారులు తెరిచే అవకాశం ఉంటుంది. అందుకే, ఈ ఫామ్‌ను ఎలా మెయింటైన్ చేస్తారు అనేదే రో కో భవిష్యత్తుకు అసలైన పరీక్ష.

Related Post

Pennsylvania defense attorney shocked: FBI nabs explicit child abuse suspect in courtPennsylvania defense attorney shocked: FBI nabs explicit child abuse suspect in court

Content warning: This article describes child sexual abuse. Please take care while reading. On Monday, September 29, 2025, Richard Allen Adamsky, a former teacher and youth sports coach from Warminster,

Naveen Polishetty Lights Up Bhimavaram as ‘Bheemavaram Balma’ Song Launch Turns into a FestivalNaveen Polishetty Lights Up Bhimavaram as ‘Bheemavaram Balma’ Song Launch Turns into a Festival

The first song from the upcoming Sankranti 2026 entertainer Anaganaga Oka Raju, titled “Bheemavaram Balma,” was unveiled in grand style at SRKR Engineering College, Bhimavaram. The event turned into a