hyderabadupdates.com movies లడ్డూలో కల్తీ నెయ్యి నిజం అంటూ జగన్ పై ఫ్లెక్సీలు

లడ్డూలో కల్తీ నెయ్యి నిజం అంటూ జగన్ పై ఫ్లెక్సీలు

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయిందని, నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆ ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని సిట్ తేల్చింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో ఈ వ్యవహారంపై ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ నియోజకవర్గ ముఖ్య కేంద్రమైన పిడుగురాళ్ల పట్టణంలోని మెయిన్ రోడ్డులో ‘మహాపాపం నిజం’ పేరుతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. 68.17లక్షల కిలోల కల్తీ నెయ్యిని తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించారని, ఆ కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని ఫ్లెక్సీలో ప్రింట్ చేశారు.

రూ.251 కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ చైర్మన్ లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల ఫొటోలతో వెలిసిన ఫ్లెక్సీల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పిడుగురాళ్లతోపాటు వినుకొండలో కూడా ఇదే తరహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

Related Post

ఆశ్చర్యం… ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో ప్రభాస్ఆశ్చర్యం… ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో ప్రభాస్

ప్యాన్ ఇండియా హీరోలు ఒక సమయంలో ఒక సినిమా చేయడానికే కిందా మీద పడుతూ రెండు మూడేళ్లు తీసుకుంటున్న ట్రెండ్ లో పానీపూరిలు తిన్నంత ఈజీగా ప్రభాస్ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంతు చిక్కడం లేదు. తాజాగా డాన్స్ మాస్టర్

యాటిట్యూడ్ స్టార్… ఇంకా తగ్గలేదుగాయాటిట్యూడ్ స్టార్… ఇంకా తగ్గలేదుగా

తెలుగులో చాలామంది స్టార్లు ఉన్నారు. వారికి ర‌క‌ర‌కాల ట్యాగ్స్ ఉన్నాయి. కానీ యాటిట్యూడ్ స్టార్ అని ఒక ట్యాగ్ పెట్టుకుని ఓ హీరో వ‌స్తాడ‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌రు. ఈటీవీ ప్ర‌భాక‌ర్ త‌న‌యుడైన చంద్ర‌హాస్.. త‌న తొలి సినిమా లాంచ్ ఈవెంట్లో