hyderabadupdates.com movies లడ్డూ విషయం పక్క దారి పట్టేసిందా

లడ్డూ విషయం పక్క దారి పట్టేసిందా

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారగా, ఈ వ్యవహారంపై సీబీఐ నేతృత్వంలో ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన నివేదిక తర్వాత మరింతగా రాజకీయ కాక పెరిగింది. నివేదికకు ముందు, తర్వాత రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమ తప్పులేదని వైసీపీ, కాదు తప్పు చేసిందే ఆ పార్టీ అని పెద్ద ఎత్తున వివాదం ముసురుకుంది.

ఇది అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల అనంతరం దాడుల వరకు దారి తీసింది. తాజాగా టీడీపీ నేతలపైనా కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. హైకోర్టులో వేసిన పిటిషన్ దరిమిలా అంబటి కుటుంబానికి భద్రత కల్పించడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త రామచంద్రరావు సహా 31 మంది టీడీపీ నాయకులపై కేసులు పెట్టారు. ఇదిలావుంటే వైసీపీ మరింత దూకుడుగా ఉద్యమించేందుకు రెడీ అయింది.

దీనిని ఎదుర్కొనేందుకు, ఎదురు దాడి చేసేందుకు ప్రభుత్వ పక్షాలు కూడా సిద్ధమయ్యాయి. వాస్తవానికి సిట్ ఇచ్చిన నివేదికలో ఏముందన్నది ఇంకా అధికారికంగా బయటకు రావాల్సి ఉంది. అదే సమయంలో దీనిపై కోర్టు విచారణలు కూడా కొనసాగాల్సి ఉన్నాయి. ఇంత జరగాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే ఇది రాజకీయ హీట్ పెంచడం, దాడులకు, కేసులకు దారి తీయడం ఏమేరకు సమంజసం అన్నది ప్రధాన అంశం. పైగా శ్రీవారి లడ్డూ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారన్నది ప్రశ్న.

భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వ్యవహారంపై రాజకీయాలు ఆపితేనే ఈ వివాదం ఒక కొలిక్కి వస్తుంది. లేకపోతే ఇదే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతుందని, ఫలితంగా ప్రజల్లో చులకన అవుతారని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు విషయాన్ని విషయంగా చూడకుండా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ వివాదానికి తెరదించుతారో లేదో చూడాలి.

Related Post

Manchu Manoj Steps Into Music World With His New Label “Mohana Raga Music”Manchu Manoj Steps Into Music World With His New Label “Mohana Raga Music”

Actor Manchu Manoj has officially announced his entry into the music industry with the launch of his new label, “Mohana Raga Music.” The announcement is an emotional and proud moment

‘ఒరేయ్ తరుణ్ భాస్కర్… క్యారెక్టర్లో ఉండిపోకు’‘ఒరేయ్ తరుణ్ భాస్కర్… క్యారెక్టర్లో ఉండిపోకు’

దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ రిలీజైనపుడు ఆశించినంత స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. మూడో సినిమా ‘కీడా కోలా’ ఓ