hyderabadupdates.com movies లెజెండరీ నటుడి ఆఖరి కోరిక తీరదేమో

లెజెండరీ నటుడి ఆఖరి కోరిక తీరదేమో

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో, అతి పెద్ద స్టార్లలో ఒకడైన ధర్మేంద్ర ఇటీవలే కాలం చేశారు. ‘షోలే’ సహా అనేక చిత్రాలతో ఆయన భారతీయ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ధర్మేంద్ర మరణానంతరం ఆయన జ్ఞాపకాలు అభిమానులను వెంటాడుతున్నాయి. కదిలిస్తున్నాయి. తాజాగా ధర్మేంద్ర తనయుడు సన్నీ డియోల్.. తన తండ్రి అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురి చేసే ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

అది ధర్మేంద్ర తన చివరి చిత్రం ‘ఇక్కీస్’ ఆఖరి రోజు షూటింగ్ సందర్భంగా తీసింది కావడం గమనార్హం. దర్శక నిర్మాతలతో పాటు టీం అంతటికి థ్యాంక్స్ చెబుతూ.. చాలా ఎమోషనల్‌గా మాట్లాడిన వీడియో అది. షూట్ చివరి రోజు కావడంతో ఈ టీంను తాను మిస్సవుతానని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు ఆయన ఒక కోరికను ఈ వీడియోలో బయటపెట్టారు.

తన చివరి చిత్రాన్ని భారత్, పాకిస్థాన్ ప్రజలు చూడాలని కోరుకుంటున్నట్లు ధర్మేంద్ర వెల్లడించారు. కానీ ఈ లెజెండరీ నటుడి ఆఖరి కోరిక తీరడం కష్టమేనని చెప్పాలి. కొన్నేళ్ల నుంచి భారత్, పాకిస్థాన్ సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. ఈ ఏడాది పహల్గాం ఉగ్ర దాడి అనంతరం అవి మరింత క్షీణించాయి. ఇండియన్ మూవీస్ ఏవీ పాకిస్థాన్‌లో రిలీజ్ కావడం లేదు.

పాకిస్థాన్ ఆర్టిస్టులు కూడా ఒకప్పట్లా బాలీవుడ్ సినిమాల్లో నటించే పరిస్థితి లేదు. సమీప భవిష్యత్తులో కూడా ఇండియన్ సినిమాలు పాకిస్థాన్‌లో రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ధర్మేంద్ర, జైదీప్ అహ్లావత్ కలయికలో తెరకెక్కిన ‘ఇక్కీస్’ మూవీ జనవరి 1నే రిలీజ్ కానుంది. ‘అంధాదున్’ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. పాకిస్థాన్‌లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఎంతమాత్రం లేవు కాబట్టి ధర్మేంద్ర ఆఖరి కోరిక తీరనట్లే.

View this post on Instagram

Related Post

గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ – వీళ్ళకి అనుమతి లేదు!గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ – వీళ్ళకి అనుమతి లేదు!

ఎల్లుండి రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ కోసం మహేష్ బాబు, రాజమౌళి అభిమానులే కాదు మూవీ లవర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే ఇప్పటిదాకా ఈ ప్యాన్ వరల్డ్ మూవీకి సంబంధించి ఎలాంటి కంటెంట్ వదలకుండా జాగ్రత్త

బాలయ్య కెరీర్ లో మొదటిసారి 3Dబాలయ్య కెరీర్ లో మొదటిసారి 3D

డిసెంబర్ అయిదు విడుదల కాబోతున్న అఖండ 2 తాండవం ఎప్పుడూ చూడని ఒక సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అదే 3డి వర్షన్. ఇప్పటిదాకా బాలకృష్ణ కెరీర్ లో ఏ సినిమా ఈ సాంకేతికత వాడలేదు. ఆ మాటకొస్తే సీనియర్

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిలతెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి రాజేశాయి. ఈ క్రమంలోనే అవి రైతులతో మాట్లాడుతున్న సందర్భంగా పవన్ క్యాజువల్ గా చేసిన వ్యాఖ్యలని, వాటిపై అనవసర