hyderabadupdates.com movies లెజెండ్ పోయాడు… లీడర్ వస్తున్నాడు

లెజెండ్ పోయాడు… లీడర్ వస్తున్నాడు

నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ ‘ది లెజెండ్’తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి వచ్చింది. వందల వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయినా నటుడిగా తన తృష్ణను తీర్చుకునే ఉద్దేశంతో ఎంత నష్టమైనా సరే డబ్బుని మంచి నీళ్లలా ఖర్చు పెట్టి 2022లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు శరవణన్.

భారీ పారితోషికాలు ఇవ్వడంతో పెద్ద క్యాస్టింగ్ తో పాటు జెడి జెర్రీ లాంటి అనుభవమున్న దర్శకుడితో పరిచయం చేయించుకున్నాడు. సరే అది డిజాస్టర్ అయ్యింది, ఇక మనోడు రాడనుకుని మూవీ లవర్స్ రిలాక్స్ అయ్యారు. కానీ శరవణన్ ఆ టైపు కాదు. తిరిగి లీడర్ గా వస్తున్నాడు.

ఏప్రిల్ లో విడుదల కానున్న లీడర్ తాలూకు టీజర్ ఇవాళ రిలీజ్ చేశారు. రజినీకాంత్ రేంజ్ లో ఒక భీభత్సమైన ఫైట్ ఎపిసోడ్ ద్వారా శరవణన్ ని పరిచయం చేసి కథలో పాప సెంటిమెంట్ కీలకంగా ఉన్న విషయాన్ని బయట పెట్టారు. దీనికి దర్శకుడు ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్.

శివ కార్తికేయన్, ధనుష్, శశికుమార్ లాంటి స్టార్లను డీల్ చేసిన ఈ డైరెక్టర్ ఈసారి శరవణన్ ని ప్రమోట్ చేసే బాధ్యతను తీసుకున్నారు. రెగ్యులర్ కమర్షియల్ హీరోని ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తారో అచ్చం అలాగే లీడర్ ని డిజైన్ చేయడం గమనార్హం. చూస్తుంటే ఈసారి కూడా బడ్జెట్ గట్టిగానే పెట్టినట్టు కనిపిస్తోంది.

ఒక విషయంలో శరవణన్ ని మెచ్చుకోవాలి. ఎంత డబ్బున్నా ప్రేక్షకుల మద్దతు లేకుండా స్క్రీన్ మీద నెట్టుకురావడం అసాధ్యం. అయితే మొదటిసారి తిరస్కారానికి గురైనా రెండో ప్రయత్నానికి పూనుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. అది కూడా ఇంత గ్యాప్ తర్వాత.

గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్న లీడర్ ని ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా రిలీజ్ కానుంది. ఒరిజినల్ భాషలో ఆయనకు వ్యాపారాలు, ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఏదో అనుకోవచ్చు. అసలు సంబంధమే లేని తెలుగు ప్రేక్షకులతో కనెక్ట్ కావాలని శరవణన్ ప్రయత్నించడం నిజంగా ఆశ్చర్యం.

Related Post

అఖండ-2… మళ్లీ ఇక్కడ టెన్షనేనా?అఖండ-2… మళ్లీ ఇక్కడ టెన్షనేనా?

డిసెంబరు 5 నుంచి వాయిదా పడ్డ నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘అఖండ-2’ను మరీ ఆలస్యం చేయకుండా వారం వ్యవధిలోనే రిలీజ్ చేసేస్తున్నారు. 12 సినిమాకు అఫీషియల్ రిలీజ్ డేట్ కాగా.. 11న రాత్రి సెకండ్ షోతో ప్రిమియర్స్ మొదలవుతున్నాయి. ఆ షోలు

Telusu Kada is a never-before-seen love story – Siddhu JonnalagaddaTelusu Kada is a never-before-seen love story – Siddhu Jonnalagadda

Star Boy Sidhu Jonnalagadda starrer Telusu Kada has created good anticipation with the blockbuster songs of S Thaman and teaser, trailer have captured the imagination of all audiences. Now, Siddhu