hyderabadupdates.com movies లేక లేక కప్పు గెలిస్తే.. ఇలా అయ్యిందేంటి?

లేక లేక కప్పు గెలిస్తే.. ఇలా అయ్యిందేంటి?

ఐపీఎల్ ట్రోఫీని గెలవాలని తొలి సీజన్ నుంచి ఎంతో ప్రయత్నించినా.. 16 సంవత్సరాల పాటు ఆ కలను నెరవేర్చుకోలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐదేసి కప్పులు సాధించగా.. బలం, ఆకర్షణ పరంగా ఆ రెండు జట్లకూ ఏమాత్రం తీసిపోనట్లు కనిపించే ఆర్సీబీకి మాత్రం ఒక్క కప్పూ దక్కలేదు. ప్రతిసారీ భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. ఏదో ఒక దశలో నిష్క్రమించడం.. ఇదీ వరస. 

ఆర్సీబీ కప్పు గెలవకపోవడంపై ఎన్నో ఏళ్ల నుంచి ఎంత ట్రోలింగ్ జరుగుతూ వచ్చిందో తెలిసిందే. కోహ్లి సారథ్యంలో పుష్కర కాలం పాటు ప్రయత్నించి ఫెయిలైన ఆర్సీబీ.. ఎట్టకేలకు ఈ ఏడాది రజత్ పటిదార్ నాయకత్వంలో కలను నెరవేర్చుకుంది. కోహ్లి కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గెలిచిన అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు, యాజమాన్యం, అభిమానుల ఆనందానికి అవధులే లేకపోయాయి.

కానీ ఇంత సాధించి ఏం లాభం? వాళ్ల ఆనందం కొన్ని రోజులు కూడా నిలవలేదు. ఆర్సీబీ విజయోత్సవ సంబరాల సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని 11 మంది చనిపోవడంతో ఆనందం ఆవిరైపోయింది. ఆ విషాదం వల్ల ఆర్సీబీ చుట్టూ తీవ్రమైన నెగెటివిటీ ముసురుకుంది. విమర్శలు, ఆరోపణలు, కేసులతో ఆర్సీబీ ప్రతిష్ట మసకబారింది. ఇది ఆర్సీబీ బ్రాండ్ వాల్యూను కూడా దెబ్బ తీసింది. చివరికి ఇప్పుడు ఆర్సీబీ యాజమాన్యం జట్టును అమ్మడానికి రెడీ అయిపోయింది.

ఒక టీం కప్పు గెలిస్తే బ్రాండ్ వాల్యూ పెరగడం.. యజమానుల్లో ఇంకా ఉత్సాహం రావడం చూస్తుంటాం. కానీ ‘ఆర్సీబీ’ విషయంలో దీనికి భిన్నంగా జరగబోతోంది. ఆర్సీబీ సేల్ పూర్తయితే.. వచ్చే ఏడాది జట్టు పేరే మారిపోతుంది. అంటే డిఫెండింగ్ ఛాంపియన్ అని చెప్పుకోవడానికి ఆర్సీబీనే ఉండదన్నమాట. ఇలా కప్పు గెలవగానే తర్వాతి ఏడాదికి ఆ పేరే లేకుండా పోవడం ఎప్పుడూ జరగలేదు. డెక్కన్ ఛార్జర్స్ విషయంలో కొన్నేళ్ల తర్వాత జరిగింది. ఆర్సీబీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న కోహ్లి లాంటి ఆటగాళ్లకు, అభిమానులకు ఇది తీవ్ర నిరాశ కలిగించే విషయమే.

Related Post

బాల్క సుమ‌న్ కు రిమాండ్‌.. కేటీఆర్ వడ్డీ వార్నింగ్బాల్క సుమ‌న్ కు రిమాండ్‌.. కేటీఆర్ వడ్డీ వార్నింగ్

బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేప‌థ్యంలో తెలంగాణ రాజ‌కీయాలు మ‌రో సారి నిప్పు రాజుకున్నాయి. అస‌లే మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో క‌నీసం రెండు ప‌దుల సంఖ్య‌లో  కూడా స్థానాలు ద‌క్కించుకోలేద‌న్న ఆవేద‌న‌లో బీఆర్ఎస్ నాయ‌కులు ఉన్నారు. ఇలాంటి

పోల‌వ‌రంలో జ‌గ‌న్‌కు ముడుపులు.. జ్యోతుల సంచ‌ల‌నం..!పోల‌వ‌రంలో జ‌గ‌న్‌కు ముడుపులు.. జ్యోతుల సంచ‌ల‌నం..!

పోలవరం ప్రాజెక్టును తన తండ్రి మాజీ సీఎం దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించారని దీనిని తాను ప్రాణప్రదంగా భావిస్తున్నామని వైసిపి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అసెంబ్లీలోనూ పోలవరం ప్రాజెక్టుపై ఆయన సుదీర్ఘ ప్రసంగం

అవతార్ వచ్చినా… దురంధరే గెలుస్తోందిఅవతార్ వచ్చినా… దురంధరే గెలుస్తోంది

ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం. అది కూడా రిలీజ్ కు ముందు నెగటివ్ వైబ్రేషన్స్ మోసుకుని, ఉద్దేశపూర్వకంగా కొందరు క్రిటిక్స్ నెగటివ్ చేయాలని చూసినా తట్టుకుని