hyderabadupdates.com movies లొంగిన మావోయిస్టుల ‘ఆశ’.. నెక్ట్స్ ఏంటి?

లొంగిన మావోయిస్టుల ‘ఆశ’.. నెక్ట్స్ ఏంటి?

ప్ర‌జా ఉద్య‌మాలు అంద‌రికీ తెలిసిందే. కానీ, మావోయిస్టు ఉద్య‌మాల లెక్క వేరుగా ఉంటుంది. అయితే.. ఇప్ప‌డు ఆ ఉద్య‌మం.. లొంగుబాట ప‌ట్టింది. ఆప‌రేష‌న్ క‌గార్ కావొచ్చు.. పార్టీలో చీలిక‌లు కావొచ్చు.. ఏదే మైనా.. మావోయిస్టు అగ్ర‌నేత‌ల‌ను కాపాడుకోలేని దైన్యం మాటున లొంగుబాటుల ప‌ర్వం తెర‌మీదికి వ‌చ్చింది. ఇలా లొంగిపోతున్న‌వారిలో చిన్న చిత‌కా అయితే.. అస‌లు ప్ర‌స్థావ‌నే ఉండేది కాదు. పార్టీ కోసం.. అహ‌ర‌హం శ్రమించి… మారు వేషాల్లో కీల‌క నేత‌ల హ‌త్య‌ల‌కు ప్రణాళిక‌లు వేసిన నాయ‌కులే లొంగుబాట ప‌ట్టారు.

తాజాగా ఆశ‌న్న‌.. అసలు పేరు త‌క్కెళ్ల‌ప‌ల్లి వాసుదేవ‌రావు, ఉర‌ఫ్ ర‌మేష్‌, రూపేష్‌, సాజీ.. కూడా చ‌త్తీస్ గ‌ఢ్ పోలీసుల ముందు లొంగిపోయారు. దాదాపు 170 మందితో ఆయ‌న స‌ర్కారుకు స‌రెండ‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. నిజానికి మావోయిస్టుల‌కు, వారి సిద్ధాంతాల‌కు.. మ‌ల్లోజుల వేణుగోపాల్‌, ఆ త‌ర్వాత ఆశ‌న్న కీల‌కం. ఎందుకంటే.. ఎవ‌రు ఎటు పోయినా..ఎంత మంది మ‌ర‌ణించినా.. దండ‌కార‌ణ్యం స‌హా.. న‌క్స‌ల్స్ బ‌రి నుంచి ఉద్య‌మాన్ని ముందుకు తీసుకువెళ్లిన వారు వీరిద్ద‌రే.

అంతేకాదు.. వీరిద్ద‌రూ కూడా బ‌ల‌మైన నాయ‌కులుగా మ‌వోయిస్టు పార్టీ(నిషేధిత‌)లో మెలిగారు. ఇరువురికి 12-15 భాష‌లు వ‌చ్చ‌ని అంటారు. నేపాల్‌లోనూ వీరికి ఆద‌ర‌ణ ఉంది. అలాంటి వారు తాజాగా లొంగిపోయా రు. ఆశ‌న్న‌పై.. ఏకంగా 5 కోట్ల పైబ‌డి రివార్డు ఉంద‌ని చెబుతున్నారు. దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఆయ‌న‌కు ఇవ్వ‌నున్నారు. ఈయ‌న‌తో పాటు.. ప‌లు డివిజ‌న్ల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప‌లువురు నాయ‌కులు కూడా లొంగిపోయారు.

త‌దుప‌రి ఏం చేస్తారు?

మావోయిస్టు అగ్ర‌నాయ‌కులు లొంగిపోయారు.. స‌రే.. మ‌రి నెక్ట్స్ ఏం చేస్తార‌న్న ప్ర‌శ్న స‌హ‌జంగానే తెర‌మీ దికి వ‌స్తుంది. వీరిపై సుమారు రెండు నుంచి మూడేళ్ల‌పాటు నిఘా కొన‌సాగుతుంది. ఇక‌, వీరికి ప్ర‌భుత్వాల నుంచి రివార్డుల‌తోపాటు.. జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసే వారికి అమ‌లు చేస్తున్న ప్యాకేజీ ఇస్తారు. అదేస‌మయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామ‌ని.. ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌భుత్వం ప్ర‌కటించింది. వారుఏదైనా వ్యాపారం చేసుకుంటే రుణాలు ఇప్పిస్తామ‌ని తెలంగాణ డీజీపీ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. అయితే.. సాధార‌ణంగా.. మావోయిస్టులు ప్ర‌జా ఉద్య‌మాల‌కు నేతృత్వం వ‌హించేందుకు ముందుకు వ‌స్తారు. కాబ‌ట్టి ఆ కోణంలో ఏమైనా ప్లాన్ ఉందేమో చూడాలి.

Related Post

Surya and Ravi Teja Set the Stage on Fire at ‘Mass Jathara’ Pre-Release EventSurya and Ravi Teja Set the Stage on Fire at ‘Mass Jathara’ Pre-Release Event

The upcoming mass entertainer Mass Jathara, starring Mass Maharaj Ravi Teja and Sreeleela, is gearing up for a grand worldwide release on October 31. Directed by Bhanu Bhogavarapu and produced

6 Malayalam Films Expected to Release for Summer 2026: Mohanlal’s Drishyam 3 to Mammootty’s Patriot6 Malayalam Films Expected to Release for Summer 2026: Mohanlal’s Drishyam 3 to Mammootty’s Patriot

Cast: Mammootty, Mohanlal, Fahadh Faasil, Nayanthara, Kunchacko Boban, Darshana Rajendran, Revathi Director: Mahesh Narayanan Genre: Spy Action Drama Patriot, starring Mammootty in the lead, is expected to release for Vishu