hyderabadupdates.com movies లోకల్ ఛానెల్లో ‘జననాయగన్’

లోకల్ ఛానెల్లో ‘జననాయగన్’

పైరసీలో ఎన్నో రకాలు చూశాం. కానీ ఒక సినిమా విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ ఆన్ లైన్లోకి వచ్చేయడం ఇంతకుముందు ఎన్నడూ జరిగింది లేదు. తమిళ టాప్ స్టార్ విజయ్ చిత్రం ‘జననాయగన్’ విషయంలో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. తమిళనాట ఎన్నికలు అయ్యాక మే నెలాఖరులో లేదా జూన్‌లో ‘జననాయగన్’ విడుదలవుతుందని అనుకుంటుండగా.. మొత్తం సినిమా హెచ్డీ క్వాలిటీతో ఆన్ లైన్లోకి వచ్చేసింది.

పైరసీ ప్రింట్ డౌన్ లోడ్ చేసి చూడడం చట్టరీత్యా నేరం, నైతికంగా దారుణం అయినా సరే.. ఈ ఇంటర్నెట్ సముద్రంలో ఎవరిని ఎవరు ఆపగలరు? పైరసీ వెబ్ సైట్ల ద్వారా లక్షల్లో డౌన్‌లోడ్లు అవుతున్నాయన్నది స్పష్టం. ఎంతోమంది సీక్రెట్‌గా సినిమా చూస్తున్నారు. ఐతే ఇప్పుడు ఏకంగా ఒక లోకల్ ఛానెల్లో ‘జననాయగన్’ చిత్రాన్ని ప్రదర్శించడం సంచలనం రేపింది.

తమిళనాట ప్రముఖ నగరాల్లో ఒకటైన కోయంబత్తూరులో ఒక లోకల్ ఛానెల్ ‘జననాయగన్’ను ప్రసారం చేసేసింది. ఈ విషయం విజయ్ అభిమానులు, ఆయన పార్టీ కార్యకర్తలకు తెలిసి వెంటనే షో ఆపించేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఆ లోకల్ ఛానెల్ యజమానికి పోలీసులు అరెస్ట్ చేశారు. ఐతే షో ఆపించేసరికే దాదాపుగా సినిమా పూర్తి కావచ్చిందట.

‘జననాయగన్’ సినిమా లీక్ వ్యవహారం ఇంత సంచలనం రేపాక.. రాజకీయంగా కూడా దాని మీద పెద్ద చర్చ జరుగుతుండగా.. పైరసీ వెర్షన్‌ను లోకల్ ఛానెల్లో వేసేశారంటే వాళ్లకు ఎంత ధైర్యం ఉండాలి? మరోవైపు ఈ సినిమా లీక్ విషయమై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది.

ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఎడిటింగ్ విభాగం నుంచి సినిమా లీక్ అయి ఉండొచ్చన్న ప్రచారాన్ని ఆల్ ఇండియా ఎడిటర్స్ అసోసియేషన్ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఎడిటర్‌ ప్రదీప్ రాఘవ్‌కు లీక్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది.

Related Post

నెల త‌ర్వాతా.. నెర‌వేర‌ని `ట్రంప్ సంక‌ల్పం!`నెల త‌ర్వాతా.. నెర‌వేర‌ని `ట్రంప్ సంక‌ల్పం!`

ఇరాన్‌పై అమెరికా+ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం ప్రారంభించి 29వ తేదీకి నెల పూర్త‌వుతుంది. గ‌త నెల 28న తెల‌తెల వారుతూనే ప్రారంభించిన డ్రోన్ దాడి ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌ను అతలాకుత‌లం చేసింది. వాస్త‌వానికి ఇలాంటి యుద్ధాలు ఎప్పుడైనా రాత్రి వేళ‌ల‌లో జ‌రుగుతాయి. భార‌త్‌..

Nagabandham’s Om Veera Naga is a tribute to Lord Shiva, crafted brilliantlyNagabandham’s Om Veera Naga is a tribute to Lord Shiva, crafted brilliantly

Young actor Virat Karrna is all set to leave a solid impact with this highly anticipated PAN-India film, Nagabandham. The film is directed by the visionary Abhishek Nama and produced