hyderabadupdates.com movies లోక కళ్యాణానికి ‘అఖండ’ తాండవం

లోక కళ్యాణానికి ‘అఖండ’ తాండవం

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా పేరున్న బాలకృష్ణ – దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్ లో రూపొందిన అఖండ తాండవం 2 డిసెంబర్ అయిదు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇవాళ శివరాజ్ కుమార్ ముఖ్యఅతిథిగా ట్రైలర్ లాంచ్ ఘనంగా నిర్వహించారు. అంచనాల పరంగా ఇప్పటికే పీక్స్ చూస్తున్న ఈ సీక్వెల్, బిజినెస్ పరంగా రెండు వందల కోట్ల క్లబ్బులో చేరడం ఖాయమని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. దానికి తగ్గట్టే ఏరియాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. విజువల్ గా మెయిన్ కంటెంట్ ట్రైలర్ లోనే ఉండటంతో అందరి చూపు దీని మీదే ఉంది.

దేవుడు లేడనే భయాన్ని జనంలో సృష్టిస్తే ఇండియా తమ చెప్పుచేతల్లో ఉంటుందని భావించిన శత్రు దేశాలు దానికి లక్ష్యంగా నలభై రోజులు జరిగే కుంభమేళాను లక్ష్యంగా పెట్టుకుంటారు. దానికి మంత్రశక్తులు ఉన్న ఒక దుర్మార్గుడి (ఆది పినిశెట్టి) సహాయం తీసుకుంటారు. అందరూ కలిసి విచ్చిన్నానికి ప్లాన్ చేసినప్పుడు హిమాలయాల్లో ఉండే అఖండ (బాలకృష్ణ) బయటికి వస్తాడు. ఎమ్మెల్యేగా ఉన్న తమ్ముడు (బాలకృష్ణ) కూడా తల్లి మాట కోసం రంగంలోకి దిగుతాడు. హైందవ ధర్మ రక్షణకు పూనుకున్న అఖండ ఈ మహా యుద్ధంలో ఎలా గెలిచాడనేది తెరమీద చూస్తే సమాధానం దొరుకుతుంది.

విజువల్స్ అన్నీ బోయపాటి శీను స్థాయిలో ఉన్నాయి. బడ్జెట్, స్కేల్ రెండూ పెరగడంతో పాటు ఈసారి అఘోరా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల గూస్ బంప్స్ కంటెంట్ ఖాయం. ఆది పినిశెట్టి లుక్ విభిన్నంగా ఉంది. 3డి వెర్షన్ కు తగ్గట్టు స్పెషల్ ఎఫెక్ట్స్ బలంగా జొప్పించినట్టు కనిపిస్తోంది. బాలయ్య మరోసారి డైలాగులు, ఎక్స్ ప్రెషన్లతో విశ్వరూపం చూపించేశారు. ముఖ్యంగా సంభాషణల్లో చాలా పవర్ జోడించారు. అంచనాలు అమాంతం పెంచేసిన అఖండ తాండవం 2 నందమూరి ఫ్యాన్స్ కి ఎలాంటి బ్లాక్ బస్టర్ ఇస్తుందో ఇంకో పదిహేను రోజుల్లో తేలనుంది.

Related Post

I’m indebted to NTR for Kantara Chapter 1 – Rishab ShettyI’m indebted to NTR for Kantara Chapter 1 – Rishab Shetty

Multi-talented actor-writer-director Rishab Shetty delivered a devotional epic blockbuster with his Kantara Chapter 1. The movie has collected huge Rs.509.25 crores+ gross worldwide in first week and it is running