hyderabadupdates.com Gallery వ‌న్య ప్రాణుల సంర‌క్ష‌ణ కోసం ‘హ‌నుమాన్’ కార్య‌క్రమం

వ‌న్య ప్రాణుల సంర‌క్ష‌ణ కోసం ‘హ‌నుమాన్’ కార్య‌క్రమం

వ‌న్య ప్రాణుల సంర‌క్ష‌ణ కోసం ‘హ‌నుమాన్’ కార్య‌క్రమం post thumbnail image

అమ‌రావ‌తి : మనుషులకీ వన్య ప్రాణులకీ మధ్య సంఘర్షణ నివారణకు ‘హనుమాన్’ ఫౌండేషన్ ప‌ని చేస్తుంద‌ని అన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. అటు వన్యప్రాణులు, ఇటు ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ ఫౌండేష‌న్ ప్ర‌ధాన క‌ర్త‌వ్య‌మ‌ని పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్ర‌సంగించారు. వసుధైక కుటుంబం అనే ఉన్నతమైన సిద్ధాంతాన్ని బలంగా నమ్మే దేశం మనది. సమస్త జీవకోటి, వన్యప్రాణులు ఇందులో అంతర్భాగం. మానవ మనుగడకు ప్రకృతి సమతుల్యత, వన్యప్రాణుల సంరక్షణ అత్యంత ముఖ్యం అని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే అటవీ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ ప్రాజెక్ట్ (హీలింగ్ అండ్ నర్చూరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్) ముందుకు తీసుకొచ్చామ‌ని ఉప ముఖ్యమంత్రి అన్నారు.
ఇటీవల కాలంలో వన్య ప్రాణుల వల్ల పంట, పశు సంపదకి నష్టంతోపాటు మావన భద్రతకు ముప్పు కలిగించే సంఘటనలు పెరుగుతున్నందున ఈ నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం హనుమాన్ పేరుతో 100 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను పవన్ కళ్యాణ్ అ ప్రారంభించారు. వీటిలో వన్య ప్రాణుల సంరక్షణతోపాటు వాటికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు అంబులెన్స్, రెస్క్యూ వాహనాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హనుమాన్ ప్రాజెక్ట్ మానవ-వన్యప్రాణి మధ్య ఉన్న సంఘర్షణను నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక, శాస్త్రీయ కార్యక్రమం అని అన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకు వెళ్లబోతున్నామ‌ని తెలిపారు. వన్యప్రాణులను సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ చేపట్టేలా హనుమాన్ ప్రధాన కర్తవ్యంగా ఉంటుంద‌న్నారు. ఏదైనా సంఘటన చోటు చేసుకున్నప్పుడు తక్షణ ప్రతిస్పందన, ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వర్తిస్తుందని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతోపాటు ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ అటవీశాఖ హనుమాన్ ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్తుందన్నారు.
The post వ‌న్య ప్రాణుల సంర‌క్ష‌ణ కోసం ‘హ‌నుమాన్’ కార్య‌క్రమం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

AP Cabinet: రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదంAP Cabinet: రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఇవాళ జరిగిన

25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి..ఆర్జిత సేవ‌లు ర‌ద్దు25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి..ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

తిరుమల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమ‌లలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రమైన మాఘ మాసంలో

రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారిందిరాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది

మంగ‌ళ‌గిరి : ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అన‌గాని స‌త్య ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అల్లర్లు, అశాంతి సృష్టించేలా జగన్ సైకో ముఠా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి వైసీపీ, జగన్ వైరస్‌లా