hyderabadupdates.com Gallery వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ పాల‌సీ

వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ పాల‌సీ

వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ పాల‌సీ post thumbnail image

దావోస్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మంగ‌ళ‌వారం దావోస్ లో జ‌రిగిన ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సులో పాల్గొని ప్ర‌సంగించారు. వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్‌ప్రెన్యూయర్ విధానంపై చ‌ర్చించారు. వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానాన్ని తెచ్చి ఏపీ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి చొరవ తీసుకుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి సాధించేలా… ఆదర్శవంతంగా ఉండేలా విధానాన్ని తీర్చిదిద్దామ‌న్నారు. చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధిలో అందర్నీ భాగస్వాములను చేసే ఉద్దేశ్యంతోనే వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానం తెచ్చాం అన్నారు..ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలకు మేలు జరగాలి. ఓ తరం అభివృద్ధి చెందాలని అన్నారు.
నా ఆలోచన ఎప్పుడూ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోణంలోనే ఉంటాయని స్పష్టం చేశారు .
ప్రపంచ వ్యాప్తంగా ఉండే టెక్నాలజీలను, పరిణామాలను అందిపుచ్చుకునేలా ఆలోచన చేయాల‌ని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. భారత దేశం ఇప్పుడు ఉత్పత్తి రంగం వైపు వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. దాన్ని అందిపుచ్చుకునే దిశగా మేం వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానం తెచ్చాం అన్నారు. OF-OE విధానం తేవడమే కాదు…దానికి అవసరమైన గైడెన్స్, ఇన్ఫ్రా కూడా ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్ కంపెనీలకు, ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ ద్వారా పారిశ్రామికవేత్తలు కావాలనుకునే వారికి గైడెన్స్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు నారా చంద్రబాబు నాయుడు. పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన ఇన్ఫ్రాను సిద్దం చేస్తున్నాం అన్నారు.
The post వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ పాల‌సీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

గోదావ‌రి జ‌లాలు రాకుండా అడ్డుకున్న కేసీఆర్గోదావ‌రి జ‌లాలు రాకుండా అడ్డుకున్న కేసీఆర్

వికారాబాద్ జిల్లా : ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రోసారి మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. త‌న ప‌దేళ్ల ప‌ద‌వీ కాలంలో తెలంగాణ‌ను దోచుకున్నాడ‌ని ఆరోపించారు. తెలంగాణ పేరు చెప్పి ఆనాడు జ‌గ‌న్

Vangalapudi Anitha: క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది – హోం మంత్రి అనితVangalapudi Anitha: క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది – హోం మంత్రి అనిత

    అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అండర్–19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ చాంపియన్‌షిప్ పోటీలను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. మూడు రోజులపాటు బాల, బాలికల

APEPDCL: మొంథా తుపాను ప్రభావంతో ఏపీఈపీడీసీఎల్ కు 10 కోట్లు నష్టంAPEPDCL: మొంథా తుపాను ప్రభావంతో ఏపీఈపీడీసీఎల్ కు 10 కోట్లు నష్టం

  మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్తు సరఫరా వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. బుధవారం కోనసీమ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విద్యుత్‌ పునరుద్ధరణ చర్యల పురోగతిని ఆయన వివరించారు. అన్ని సెక్షన్ కార్యాలయాలకు జనరేటర్లు,