hyderabadupdates.com Gallery వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులు

వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులు

వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులు post thumbnail image

ములుగు జిల్లా : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా వెలుగొందుతున్న శ్రీ సమ్మక్క సారమ్మ మేడారం జాతరకు భ‌క్తులు పోటెత్తారు. ఆ ప్రాంగ‌ణ‌మంతా స‌ముద్రాన్నిత‌ల‌పింప చేస్తోంది. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండ‌గా గురువారం కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి , కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరమ్ ద‌ర్శించుకున్నారు. ఈసంద‌ర్బంగా ప్ర‌భుత్వం త‌ర‌పున సహచర మంత్రులు దనసరి అనసూయ (సీతక్క) , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఘన స్వాగతం ప‌లికారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఈ సందర్భంగా వ‌న దేవ‌త‌లైన అమ్మ వార్లను దర్శించుకుని, నిలువెత్తు బంగారం సమర్పించి తమ మొక్కులు చెల్లించారు కేంద్ర‌, రాష్ట్ర మంత్రులు.
ఈ సందర్భంగా కుంభ మేళాను తలపించే విధంగా సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహిస్తున్నామని, ఇక్కడికి వచ్చే భక్తుల కోసం శాశ్వతమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని, అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని గుర్తు చేశారు. ప్రధానితో చర్చించి జాతీయ పండుగగా గుర్తింపు అందించాలని విన్న‌వించారు రాష్ట్ర మంత్రి. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు మేడారం జాతర అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి , కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరమ్ స్ప‌ష్టం చేశారు.
మేడారం మహా జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజనుల సైతం మేడారం మహా జాతర గురించి తెలుసుకోవాలని, రాబోయే రోజుల్లో ఇక్కడి అమ్మవార్లను దర్శించుకోవాలని వారు పేర్కొన్నారు. జాతరలో ఏర్పాట్లు బాగున్నాయని వారు కొనియాడారు.
The post వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

గ్లోబల్ గ్రీన్ రివల్యూషన్ హబ్‌గా ఏపీగ్లోబల్ గ్రీన్ రివల్యూషన్ హబ్‌గా ఏపీ

దావోస్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ్లోబల్ గ్రీన్ రివల్యూషన్ హబ్‌గా ఏపీని మార్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. సహజ వ్యవసాయం ఇకపై కేవలం ఎంపిక కాదని అన్నారు. భూమిని బాగు చేయడానికి ఇది అత్యంత

కోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రంకోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రం

అనంతపురం జిల్లా : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఆమె ఎండ‌గ‌ట్టారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌న‌మిస్తున్నార‌ని హెచ్చ‌రించారు. జాతీయ ఉపాధి హామీ చ‌ట్టాన్ని పున‌రుద్ద‌రించాల‌ని

Maharashtra: అవినీతిలో అగ్రస్థానంలో మహారాష్ట్ర !Maharashtra: అవినీతిలో అగ్రస్థానంలో మహారాష్ట్ర !

    దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే అవినీతిలో మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,875 అవినీతి కేసులు నమోదు కాగా ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 795 కేసులు నమోదయ్యాయి.