hyderabadupdates.com movies వరప్రసాద్ మీద అదొక్కటే విమర్శ

వరప్రసాద్ మీద అదొక్కటే విమర్శ

సంక్రాంతి పందెంలో విజేతగా నిలిచి మూడు వందల డెబ్భై అయిదు కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మన శంకరవరప్రసాద్ గారుకి ఒక్క విషయంలో మాత్రం విమర్శలు తప్పడం లేదు. నెల తిరగడం ఆలస్యం ఓటిటిలో రావడం పట్ల మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం ఫిబ్రవరి 11 నుంచి జీ ఫైవ్ లో ఈ మెగా మూవీ అందుబాటులోకి రానుంది. గత ఏడాది ఇదే ప్లాట్ ఫార్మ్ లో సంక్రాంతికి వస్తున్నాం ఇంత ఫాస్ట్ గా స్ట్రీమింగ్ చేయలేదని గుర్తు చేస్తున్నారు. నిజానికి ఈ ఆదివారం బుక్ మై షోలో తక్కువ నెంబరే అయినా కంటిన్యూ ట్రెండింగ్ లో ఉన్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదొక్కటే.

ఇంకో రెండు వారాలు డీసెంట్ రన్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పుడు ఓటిటిలో అప్పుడే ఎందుకనేది అభిమానుల ప్రశ్న. ముందే చేసుకున్న అగ్రిమెంట్ అయినా సరే కాసింత వెసులుబాటు అడిగి ఉండాల్సిందని అంటున్నారు. గతంలో హనుమాన్ లాంటివి ఈ సౌలభ్యాన్ని వాడుకుని ఓటిటిలో ఆలస్యంగా వచ్చాయి.

కానీ మన శంకరవరప్రసాద్ గారు అలాంటి మినహాయింపులు కోరలేదు. కేవలం నాలుగు వారాల గ్యాప్ కు కట్టుబడి పోయింది. ప్రాక్టికల్ గా చూస్తే వీక్ డేస్ లో ఆక్యుపెన్సీలో బాగా తగ్గిపోయాయి. ఫీడింగ్ కోసం ఆడించడమే తప్ప సీడెడ్ లాంటి ప్రాంతాల్లో ఆల్రెడీ ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది.

కొన్నేళ్లుగా ఎన్నో పెద్ద సినిమాలు నెల రోజులకే ఓటిటి డీల్స్ చేసుకోవడం గురించి ఎన్ని కామెంట్లు వస్తున్నా నిర్మాతలు పట్టించుకునే పరిస్థితి లేదు. బడ్జెట్ లు రికవరీ కావాలంటే థియేటర్ రెవిన్యూ ఒక్కటే సరిపోకపోవడంతో ఓటిటి కండీషన్లకు ఎస్ అంటున్నారు.

రాజా సాబ్, అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా ఇదే బాట పట్టగా నారి నారి నడుమ మురారి మరీ విచిత్రంగా 21 రోజులకే స్మార్ట్ స్క్రీన్ల మీద ప్రత్యక్షమయింది. కార్తీ అన్నగారు వస్తారు, శివ కార్తికేయన్ పరాశక్తి డబ్బింగ్ వెర్షన్లు అసలు థియేటర్ ఊసే లేకుండా నేరుగా చిన్ని తెరలపై వచ్చాయి. ఇదంతే ఎవరేం చేసినా ఈ ట్రెండ్ ని మార్చలేరు.

Related Post

Don 3: Shah Rukh Khan to return to the Don franchise with Atlee’s involvement?Don 3: Shah Rukh Khan to return to the Don franchise with Atlee’s involvement?

Don 3 is one of the most awaited films in Bollywood. Initially, Ranveer Singh was roped in to play the protagonist. However, recent reports suggest that Ranveer Singh has exited

జూబ్లీహిల్స్ రిసల్ట్: అంత మాట అనేశారేంటి కవిత?జూబ్లీహిల్స్ రిసల్ట్: అంత మాట అనేశారేంటి కవిత?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరుపై తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు ఈ బైపోల్‌ను చాలా సీరియస్‌గా తీసుకుని ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎగ్జిట్ పోల్స్‌లో