hyderabadupdates.com Gallery ‘వ‌ర‌ల‌క్ష్మీ న‌వీన్ చంద్ర’ ల‌వ్ సాంగ్ వైర‌ల్

‘వ‌ర‌ల‌క్ష్మీ న‌వీన్ చంద్ర’ ల‌వ్ సాంగ్ వైర‌ల్

‘వ‌ర‌ల‌క్ష్మీ న‌వీన్ చంద్ర’ ల‌వ్ సాంగ్ వైర‌ల్ post thumbnail image

హైద‌రాబాద్ : సౌత్ ఇండియన్ టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, వెర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై, బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర జంట‌పై చిత్రీకరించిన బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ ప్రేమ ఓ ప్రేమ అనే పల్లవితో మొదలైన ప్రేమ గీతాన్ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప్ర‌భు లాంచ్ చేశారు. ఈ పాట‌ అన్విక ఆడియోస్ ద్వారా రిలీజ్ అయింది. ఈ పాటకు సంగీతం సుధాకర్ మారియో సమకూర్చారు. ఈ పాట యూత్‌కు బాగా న‌చ్చుతుంద‌ని, ట్రెండింగ్‌గా నిలిచి పోతుంద‌ని, సూప‌ర్ హిట్ ల‌వ్ సాంగ్స్‌ల్లో ఈ పాట కూడా చోటు ద‌క్కించు కుంటుంద‌ని దర్శకుడు సంజీవ్ మేగోటి న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. హారర్ థ్రిల్లర్, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెర‌కెక్కించిన‌ట్టు తెలిపారు.
యాక్షన్, కామెడీ, రొమాన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన‌ ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, రవిశంకర్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు నటిస్తున్నారు. దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్–రవితేజ ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు ద‌ర్శ‌కుడు . వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది పాత్రలు వారి గత చిత్రాలకు భిన్నంగా ఉంటాయని తెలిపారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
The post ‘వ‌ర‌ల‌క్ష్మీ న‌వీన్ చంద్ర’ ల‌వ్ సాంగ్ వైర‌ల్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Anand Deverakonda Set to Thrill OTT Audiences with Action Drama ‘Takshakudu’Anand Deverakonda Set to Thrill OTT Audiences with Action Drama ‘Takshakudu’

Following the rising trend of films finding success on OTT platforms, young actor Anand Deverakonda is gearing up to captivate audiences with his upcoming action thriller, Takshakudu. The film, directed

స్వతంత్ర రాజకీయ శక్తిగా తెలంగాణ జాగృతిస్వతంత్ర రాజకీయ శక్తిగా తెలంగాణ జాగృతి

హైద‌రాబాద్ : క‌ల్వ‌కుంట్ల క‌విత రూటు మార్చింది. ఇక అన్నింటిని తెగ తెంపులు చేసుకుని ముందుకు క‌ద‌లాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా పార్టీ ప‌రంగా త‌న‌కు ల‌భించిన అరుదైన అవ‌కాశం ఎమ్మెల్సీ ప‌ద‌విని వ‌దులుకుంది. ఈ మేర‌కు రాజీనామా చేయ‌డం,

జ‌న‌సేన పార్టీ స‌భ్య‌త్వానికి ప‌వ‌న్ రూ. 2 కోట్లు విరాళంజ‌న‌సేన పార్టీ స‌భ్య‌త్వానికి ప‌వ‌న్ రూ. 2 కోట్లు విరాళం

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం, జన‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆదివారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీకి సంబంధించి క్రియాశీల‌క స‌భ్య‌త్వ నమోదు కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్బంగా త‌న