hyderabadupdates.com Gallery ‘వ‌ర‌ల‌క్ష్మీ న‌వీన్ చంద్ర’ ల‌వ్ సాంగ్ వైర‌ల్

‘వ‌ర‌ల‌క్ష్మీ న‌వీన్ చంద్ర’ ల‌వ్ సాంగ్ వైర‌ల్

‘వ‌ర‌ల‌క్ష్మీ న‌వీన్ చంద్ర’ ల‌వ్ సాంగ్ వైర‌ల్ post thumbnail image

హైద‌రాబాద్ : సౌత్ ఇండియన్ టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, వెర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై, బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర జంట‌పై చిత్రీకరించిన బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ ప్రేమ ఓ ప్రేమ అనే పల్లవితో మొదలైన ప్రేమ గీతాన్ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప్ర‌భు లాంచ్ చేశారు. ఈ పాట‌ అన్విక ఆడియోస్ ద్వారా రిలీజ్ అయింది. ఈ పాటకు సంగీతం సుధాకర్ మారియో సమకూర్చారు. ఈ పాట యూత్‌కు బాగా న‌చ్చుతుంద‌ని, ట్రెండింగ్‌గా నిలిచి పోతుంద‌ని, సూప‌ర్ హిట్ ల‌వ్ సాంగ్స్‌ల్లో ఈ పాట కూడా చోటు ద‌క్కించు కుంటుంద‌ని దర్శకుడు సంజీవ్ మేగోటి న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. హారర్ థ్రిల్లర్, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెర‌కెక్కించిన‌ట్టు తెలిపారు.
యాక్షన్, కామెడీ, రొమాన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన‌ ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, రవిశంకర్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు నటిస్తున్నారు. దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్–రవితేజ ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు ద‌ర్శ‌కుడు . వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది పాత్రలు వారి గత చిత్రాలకు భిన్నంగా ఉంటాయని తెలిపారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
The post ‘వ‌ర‌ల‌క్ష్మీ న‌వీన్ చంద్ర’ ల‌వ్ సాంగ్ వైర‌ల్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

చెన్నై సూప‌ర్ కింగ్స్ వికెట్ కీప‌ర్ గా శాంస‌న్చెన్నై సూప‌ర్ కింగ్స్ వికెట్ కీప‌ర్ గా శాంస‌న్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డ‌మే కాకుండా కేవ‌లం 5 ఇన్నింగ్స్ లు మాత్ర‌మే ఆడిన కేర‌ళ క్రికెట‌ర్

YS Jagan: సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ ! బేగంపేటలో వైసీపీ శ్రేణుల ఘన స్వాగతం !YS Jagan: సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ ! బేగంపేటలో వైసీపీ శ్రేణుల ఘన స్వాగతం !

    అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు వచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. మరోవైపు వైసీపీ

Cabinet Sub Committee: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలుCabinet Sub Committee: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలు

Cabinet Sub Committee : సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉపసంఘం (Cabinet Sub Committee) శనివారం సమావేశమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రుల స్ధాయిలో తొలిసారి సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్,