hyderabadupdates.com movies వారందరికీ కర్ణాటక, ఏపీలో సోషల్ మీడియా బ్యాన్!

వారందరికీ కర్ణాటక, ఏపీలో సోషల్ మీడియా బ్యాన్!

చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు దక్షిణాది రాష్ట్రాలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వినియోగం, సోషల్ మీడియా వ్యసనం, ఆన్‌లైన్ భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అధిక స్క్రీన్ టైమ్ ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యమన్నారు. దీంతో దేశంలో పిల్లలపై సోషల్ మీడియా వినియోగానికి నిషేధం ప్రకటించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ చర్యలు చేపట్టే దిశగా ఆలోచిస్తోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించాలని నిర్ణయించామని తెలిపారు. దీనిని 90 రోజుల్లో అమలు చేస్తామని వెల్లడించారు. అవసరమైతే 16 ఏళ్లలోపు పిల్లలపైనా నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ గతంలో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం అమల్లో ఉందని గుర్తుచేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేసే అంశంపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.

ఒక నిర్దిష్ట వయస్సుకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియా వేదికల్లో ఉండకూడదని, వారు పంచుకునే సమాచారాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. మొత్తం మీద సోషల్ మీడియా దుర్వినియోగంపై ఇరు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.

Related Post

Baahubali The Epic Roars Again: Re-release Advance Bookings Cross ₹10 Crore!Baahubali The Epic Roars Again: Re-release Advance Bookings Cross ₹10 Crore!

The mighty Baahubali legacy is back — and it’s rewriting box office history all over again! The epic film series that changed Indian cinema forever, Baahubali: The Beginning and Baahubali: