hyderabadupdates.com movies వారణాసి ఇప్పుడెందుకు గుర్తుకు వస్తోంది

వారణాసి ఇప్పుడెందుకు గుర్తుకు వస్తోంది

రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన మీడియా ప్రతినిధులు ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చాక అంచనాలు పెరిగిపోయాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని చూసిన చాలా మంది నాలుగు వేల కోట్ల స్థాయిలో బొమ్మ కనిపించలేదని పెదవి విరుస్తున్న వైనం ఎక్స్, ఇన్స్ టాలో గమనించవచ్చు. కొన్ని విజువల్స్ ఎక్స్ ట్రాడినరిగా ఉంటే మరికొన్ని టీవీ సీరియల్ తరహాలో ఉన్నాయనే కామెంట్స్ వినిపించాయి.

ఫైనల్ అవుట్ ఫుట్ ఇలాగే ఉంటుందని చెప్పలేం కానీ రిలీజ్ నాటికీ క్వాలిటీలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహేష్ బాబు వారణాసి ప్రస్తావన తెస్తున్నారు కొందరు నెటిజెన్లు. గత ఏడాది హైదరాబాద్ లో లాంచ్ చేసిన టైటిల్ కాన్సెప్ట్ వీడియోని మళ్ళీ షేర్ చేస్తున్నారు. కథలో ఉద్దేశాన్ని, రాజమౌళి ప్రెజెంట్ చేసిన తీరుని ఉదహరిస్తూ జక్కన్నకు సాటివచ్చే వాళ్ళు ఎవరూ లేరంటూ కితాబుల వర్షం కురిపిస్తున్నారు.

ఇక్కడ పోలిక సబబని చెప్పలేం కానీ రామాయణ టీమ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. రామాయణ రెగ్యులర్ మూవీ కాదు. భారతీయులకు ఒక ఎమోషన్. రాముడి కథను కొన్ని వందల వేలసార్లు చూసినా మళ్ళీ చూసేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటప్పుడు ఇంత పెద్ద క్యాస్టింగ్ ఉన్న గ్రాండియర్ నుంచి విపరీతంగా ఎక్స్ పెక్ట్ చేయడం సహజం. వావ్ అనిపించాల్సిందే. జస్ట్ బాగుందనే మాట సరిపోదు. దానికోసం ఎంత కష్టమైనా పడాల్సిందే.

ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలమంది ఈ ప్రాజెక్టు మీద పని చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ల్యాండ్ మూవీగా నిలిచిపోవాలని నిర్మాత నమిత్ మల్హోత్రా కంకణం కట్టుకున్నారు. అయితే ఏఐ టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో డిఎన్ఈజి సంస్థ నుంచి జనాలు బెస్ట్ ఆశిస్తున్నారు. ఆ మోతాదు ఏ మాత్రం తగ్గినా ఒప్పుకునే పరిస్థితి లేదు. రెహమాన్, జిమ్మర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నప్పటికీ ఇంకా హై ఉండాలని మ్యూజిక్ లవర్స్ కోరుతున్నారు. రామాయణ డిస్కషన్ ఇంకెక్కడి దాకా వెళ్తుందో చూడాలి.

Related Post

Ravi Teja’s “Mass Jathara” Promises a Full-On Blast, Says Producer Naga VamsiRavi Teja’s “Mass Jathara” Promises a Full-On Blast, Says Producer Naga Vamsi

Producer Naga Vamsi has raised the excitement for Mass Jathara to the next level! Sharing his confidence about the film’s power-packed content, he said that the “pre-interval 25 minutes and

క్యాష్ చేసుకోవడం ఉస్తాద్ చేతుల్లోనే ఉందిక్యాష్ చేసుకోవడం ఉస్తాద్ చేతుల్లోనే ఉంది

సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ సినిమాగానే కాదు గత నలభై రోజులుగా తమ హాళ్లకు ఫీడింగ్ ఇచ్చే స్టార్ హీరో బొమ్మ ఒక్కటీ