hyderabadupdates.com movies ‘వారణాసి’ విహారం : మైండ్ బ్లోయింగ్

‘వారణాసి’ విహారం : మైండ్ బ్లోయింగ్

వెయ్యి కళ్ళతో మూవీ లవర్స్ ఎదురు చూసిన వారణాసి కాన్సెప్ట్ ట్రైలర్ ని గ్లోబ్ ట్రాట్టింగ్ ఈవెంట్ లో లాంచ్ చేశారు. రాజమౌళి ముందే చెప్పినట్టు ఇందులో కథను పూర్తిగా ఓపెన్ చేయలేదు. కాకపోతే లోతుగా డీ కోడింగ్ చేసుకుంటే ఎంతో కొంత అర్థమయ్యేలా చేశారు. అయిదవ శతాబ్దం వారణాసిలో కథ మొదలై వర్తమానంలోకి వచ్చి ఇక్కడి నుంచి ఆఫ్రికా అడవులు, వనాంచల్ ద్వారా త్రేతాయుగంలో లంకా నగరానికి వెళ్లేలా ఒకటి రెండు కాదు ఏడెనిమిది ప్రపంచాలను జక్కన్న విహారం చేయించారు. ఒక అగ్నిశిఖ భూమి నుంచి ఆకాశానికి చేరుకుని, అక్కడి నుంచి ఒక ఉల్కాపాతం జారిపడితే తర్వాత జరిగే పరిణామాలు కారణ జన్ముడైన రుద్ర(మహేష్ బాబు)ని దేనికీ ప్రేరేపించాయనేది పాయింట్ గా కనిపిస్తోంది.

వీడియోలో అధిక శాతం సిజి విజువల్స్ ఉన్నాయి. నంది వాహనం మీద రౌద్ర రూపంలో మహేష్ బాబు సమర నినాదంతో వస్తున్న ఒక షాట్ లో రివీల్ చేయడం తప్ప ఇతర ఆర్టిస్టులను చూపించలేదు. బహుశా రిలీజ్ డేట్ దగ్గరగా ఉన్నప్పుడు క్యారెక్టర్ ఇంట్రో వీడియోస్ రిలీజ్ చేయడం ద్వారా పరిచయం చేసే ప్లాన్ ఉండొచ్చు. అయితే బాహుబలి కేవలం మాహిష్మతికి పరిమితమయ్యింది. ఆర్ఆర్ఆర్ బ్రిటిష్ సామ్రాజ్యం దాటి పోలేదు. కానీ ఇప్పుడీ వారణాసి అలా కాదు. ఏవేవో లోకాలు చుట్టేస్తోంది. యుగాలు దాటి త్రేతాయుగం నుంచి కలియుగం దాకా అన్ని టచ్ చేసేలా విజయేంద్ర ప్రసాద్, కాంచిలు ఎలాంటి కథ రాశారో అంతు చిక్కడం కష్టమనిపించేలా ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే వారాణసి విజువల్స్, కీరవాణి బీజీఎమ్ మైండ్ బ్లోయింగ్ అనిపించేశాయి. దీన్ని బట్టి సినిమా మీద అంచనాలు పెంచడం తగ్గించుకోవడం చేయలేం కానీ రాజమౌళి విజన్ ఏ స్థాయిలో ఉండబోతోందో మాత్రం అర్థమయ్యింది. ముఖ్యంగా ఐమ్యాక్స్ కెమెరాతో షూట్ చేస్తున్నారంటేనే స్టాండర్డ్ ఏ రేంజ్ లో ఉండబోతోందో ఊహించుకోవచ్చు. 2027 విడుదలకు సిద్ధం కానున్న వారణాసి కోసం సినీ ప్రియులు ఇంకో ఏడాదిన్నర పైగానే వెయిట్ చేయాల్సి ఉంటుంది, రాజమౌళి విషయంలో ఇది ఎప్పుడు జరిగేదే కాబట్టి అంత ఎదురుచూపులకు న్యాయం జరిగే తీరుతుంది. కాకపోతే ఈసారి వరల్డ్ మొత్తం తల తిప్పి చూసేంత పెద్ద స్థాయిలో.

Related Post

యూరప్ వీసా రిజెక్ట్ అవుతుందా? మీరు చేసే అతిపెద్ద తప్పులివేయూరప్ వీసా రిజెక్ట్ అవుతుందా? మీరు చేసే అతిపెద్ద తప్పులివే

యూరప్ ట్రిప్ అనేది చాలామంది కల. కానీ, పారిస్ వీధుల్లో తిరగాలని కలలు కనే వేలాది మంది ట్రావెలర్స్, చివరి నిమిషంలో షెంజెన్ వీసా రిజెక్షన్ ఎదుర్కొని షాక్‌కు గురవుతున్నారు. 2024లోనే ఏకంగా 1.7 మిలియన్ల దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి. దీంతో