hyderabadupdates.com movies వారిని కూడా జైల్లో వేస్తానంటున్న జగన్

వారిని కూడా జైల్లో వేస్తానంటున్న జగన్

ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేసింది. పీపీపీ విధానంలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తే తప్పేంటని సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తుండగా, ఇది ఒక స్కామ్ అంటూ వైయస్ జగన్ ఆరోపిస్తున్నారు. పిపిపి విధానంలో మెడికల్ కాలేజీలను దక్కించుకున్న వారిని తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైల్లో వేస్తామంటూ ఈరోజు జగన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

గవర్నర్ ను కలిసే ముందుగా ఆయన పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లు, హాస్పిటల్స్ ఎందుకు నడపాలి అని ప్రపంచం మొత్తంలో అనుకునేది చంద్రబాబు ఒక్కరే. పోలీస్ శాఖను కూడా ప్రైవేటైజ్ చేస్తానంటున్నారని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని జైల్లో వేస్తానని హెచ్చరికలు జారీ చేయడం ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే అని తెలుగుదేశం పార్టీ అంటోంది. 

చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడుతూ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల పేర్లు కూడా ‘ప్రభుత్వ కళాశాల’ అనే ఉంటాయన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తే మీకు వచ్చే నష్టం ఏమిటని ఆయన ప్రశ్నించారు? రుషికొండకు పెట్టిన 500 కోట్లతో ఇంకో రెండు కాలేజీలు కట్టొచ్చు అన్నారు. 

దీనికి జగన్ కౌంటర్ ఇచ్చారు. మేము రిషికొండలో రూ.240 కోట్లతో బ్రహ్మాండమైన బిల్డింగ్‌ నిర్మించాం. అది విశాఖకు తలమానికంగా ఉంది. చంద్రబాబు ఒక్క రోజు యోగాకు రూ.330 కోట్లు ఆవిరి చేసారని ఆరోపణలు గుప్పించారు. 

పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై మొదటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఉన్నారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా… అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని చెబుతున్నారు. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందన్నారు. ఇందులో 100 శాతం అవుట్ పేషెంట్ సేవలు ఉచితం. 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయి, సీట్లు కూడా పెరుగుతాయనేది సీఎం చంద్రబాబు నాయుడు భావన.

“పూర్వకాలం నా చిన్నప్పుడు N. జనార్ధన్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఇచ్చినందుకు రాజీనామా చేశారు.ఈ చంద్రబాబు ఇప్పటికీ ఆపకపోతే రేపు మన ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లో ఆ ప్రైవేట్ వాళ్ళందరూ జైల్లో ఉంటారు.”– #YsJagan pic.twitter.com/Ue6WqQ2vCK— Gulte (@GulteOfficial) December 18, 2025

Related Post

`ఎర్ర‌చంద‌నం`పై ప‌వ‌న్ భేషైన ఆలోచ‌న‌… బాబు కితాబు!`ఎర్ర‌చంద‌నం`పై ప‌వ‌న్ భేషైన ఆలోచ‌న‌… బాబు కితాబు!

ఎర్ర‌చంద‌నం.. ఏపీలో మాత్ర‌మే.. అది కూడా తిరుప‌తి జిల్లాలోని శేషాచ‌లం అడ‌వుల్లో మాత్ర‌మే ల‌భించే అరుదైన వృక్షాలు. అయితే.. వీటిని అక్ర‌మార్కులు తెగ‌న‌రికి పెద్ద ఎత్తున ర‌వాణా చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి అమాయ‌కులైన ఏపీ, తెలంగాణ పౌరుల‌ను, కూలీల‌ను

Varanasi: Rajamouli & Mahesh Babu’s film to have a 30-minute action sequenceVaranasi: Rajamouli & Mahesh Babu’s film to have a 30-minute action sequence

The biggie that marks the first collaboration between Mahesh Babu and SS Rajamouli is officially titled ‘Varanasi.’ The grand event related to this globe-trotting film is currently happening in Hyderabad.