hyderabadupdates.com movies విచారణలో కేసీఆర్ ఎమోషనల్

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే సిట్ అధికారులు ఆయనను ఆన్ కెమెరా విచారణ జరిపారు. అయితే, సిట్ విచారణకు ముందు బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ లంచ్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారని తెలుస్తోంది.

ఈ గదిలో కూర్చొని ఈ ఇంట్లో నుంచే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ రచన చేశానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారట. ఉద్యమానికి ఊపిరి పోసిన ఈ గదిలోనే ఈ తరహా ఆరోపణలపై విచారణ ఎదురుకోవాల్సి వచ్చిందని కేసీఆర్ ఎమోషనల్ అయ్యారట.

ఇటువంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదని బాధపడ్డారట. ప్రత్యేక తెలంగాణ కోసం ఈ గదిలోనే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, ఎంతో మందితో చర్చలు జరిపానని గుర్తు చేసుకున్నారట. ఇక్కడ ఆ విచారణను ఎదుర్కోవడం దురదృష్టకరమని అన్నారట.

విచారణ నేపథ్యంలో నంది నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కాగా, కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టగా…ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు.

నాలుగున్నర గంటల సుదీర్ఘ విచారణ తరువాత సిట్ అధికారులు కేసీఆర్ నివాసాన్ని విడిచి వెళ్ళారు. ఐతే చట్టప్రకారం 65 సంవత్సరాల పైబడిన వారిని సాయంత్రం 6 గంటల తరువాత ప్రశ్నించడానికి వీల్లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై సిట్ అధికారులు స్పందించాల్సి ఉంది.

Related Post

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ‘దివ్యాంగ శక్తి’ పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు ప్రారంభించారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ

వారణాసి – వెయ్యి కోట్లు కాదు… అంతకు మించి!వారణాసి – వెయ్యి కోట్లు కాదు… అంతకు మించి!

భారతీయ సినిమాల బడ్జెట్లు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ఇండియన్ సినిమా పొటెన్షియాలిటీ ఏంటో ‘బాహుబలి’ సినిమా రుజువు చేయడంతో ఆ తర్వాత వందల కోట్ల బడ్జెట్లలో సినిమాలు తీయడం కామన్ అయిపోయింది. ఐతే ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమాల్లో అల్లు అర్జున్,