hyderabadupdates.com movies విజయ్ తప్పు లేదన్న అజిత్

విజయ్ తప్పు లేదన్న అజిత్

సెప్టెంబరు నెలాఖర్లో తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ రోడ్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మాటలకందని ఈ విషాదం విషయమై తప్పు ఎవరిదే అనే విషయంలో పెద్ద చర్చే జరిగింది. టీవీకే అధినేత విజయే దీనికి బాధ్యత వహించాలంటూ అధికార డీఎంకే దాడి చేసింది. టీవీకేయేమో ప్రభుత్వానిదే బాధ్యత అని, దీని వెనుక కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తం చేసింది. 

సినీ జనాలు కొందరు విజయ్‌కి మద్దతుగా మాట్లాడారు. కొందరు విజయ్‌ని తప్పుబట్టారు. మిగతా వాళ్లు మౌనం వహించారు. ఐతే సినీ రంగంలో చాలా ఏళ్లుగా విజయ్‌కి ప్రధాన పోటీదారుగా ఉన్న అజిత్ ఈ అంశంపై ఒక ఇంటర్వ్యూలో స్పందించడం గమనార్హం. మీడియాకు దూరంగా ఉండే అజిత్.. లేక లేక ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో కరూర్ విషాదం గురించి స్పందించాడు.

విజయ్ పేరు ఎత్తకుండా పరోక్షంగా అతడికి మద్దతుగా నిలిచాడు అజిత్. ఈ విషాదానికి ఏ ఒక్క వ్యక్తినో బాధ్యుడిని చేయడం తప్పని అజిత్ అభిప్రాయపడ్డాడు. దీనికి ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాలని అతనన్నాడు. సినీ తారలను, రాజకీయ నాయకులను చూసేందుకు భారీగా జనం గుమికూడడం పెరిగిపోతోందని.. దీని మీద మోజు తగ్గించుకోవాలని అజిత్ అన్నాడు. ఈ కార్యక్రమాలను సరిగా నిర్వహించలేకపోతున్నారని, కాబట్టి వీటిని నియంత్రించాలని అజిత్ అన్నాడు.

సినీ నటులుగా తాము ఎంతో కష్టపడేది జనాల నుంచి ప్రేమ పొందడానికే అని.. కానీ ఆ ప్రేమను చూపించే పద్ధతి ఇది కాదని అజిత్ అన్నాడు. సెలబ్రెటీలను చూడడానికి జనం ఎగబడడం తగ్గించాలని.. ఈ విషయంలో మీడియా అందరికంటే ఎక్కువ బాధ్యతగా ఉండాలని.. వీటి పట్ల జనాల్లో ఆసక్తి పెంచడం తగ్గించాలని అజిత్ అభిప్రాయపడ్డాడు. కరూర్ లాంటి ఘటనలకు అందరం బాధ్యత వహించి.. ఇకపై ఇలాంటివి జరగకుండా ఏం చేయాలో అది చేయాలని అజిత్ సూచించాడు.

Related Post

ఫౌజీ దర్శనం ఎప్పుడు ఉంటుందిఫౌజీ దర్శనం ఎప్పుడు ఉంటుంది

రాజా సాబ్ ఫలితం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందిన మాట వాస్తవమే కానీ రాబోయే ప్రభాస్ సినిమాలు చాలా ప్రామిసింగ్ గా ఉన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోకూడదు. అధిక శాతం అభిమానుల దృష్టి స్పిరిట్ మీద ఉంది కానీ ఆల్రెడీ

తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే…!తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే…!

యంగ్ టీమ్ చేసిన సినిమాలను త్వరగా ఆడియెన్స్ దగ్గరకు రీచ్ చేసేది మ్యూజిక్. వినగానే గుర్తుండిపోయే సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఆడియెన్స్ కు తమ సినిమాను దగ్గర చేసే ప్రయత్నం చేస్తోంది “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా టీమ్. ఈ సినిమా నుంచి

బాహుబ‌లి ఎఫ‌క్ట్… పుష్ప‌పై డిస్క‌ష‌న్‌బాహుబ‌లి ఎఫ‌క్ట్… పుష్ప‌పై డిస్క‌ష‌న్‌

బాహుబ‌లి సినిమాతో ఇండియ‌న్ సినిమాకు ఒక టార్చ్ బేర‌ర్‌గా మారాడు రాజ‌మౌళి. ఎంత భారీ క‌ల‌నైనా క‌ని.. దానికి స‌రైన రూపం ఇస్తే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అసాధార‌ణ ఫ‌లితాలు రాబ‌ట్ట‌వ‌చ్చని ఆ సినిమాతో రుజువు చేశాడు జ‌క్క‌న్న‌. బాక్సాపీస్ ద‌గ్గ‌ర ఆ