hyderabadupdates.com Gallery విద్యుత్ సంక్షోభం నుంచి నేత‌న్న‌ల‌ను కాపాడాలి

విద్యుత్ సంక్షోభం నుంచి నేత‌న్న‌ల‌ను కాపాడాలి

విద్యుత్ సంక్షోభం నుంచి నేత‌న్న‌ల‌ను కాపాడాలి post thumbnail image

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ ఎల్వీ ర‌మ‌ణతో క‌లిసి రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ను అసెంబ్లీలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో నేత‌న్న‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఏక‌రువు పెట్టారు. ఈసంద‌ర్బంగా తాజాగా సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరారు మ‌ల్లు భ‌ట్టిని. ఇదే స‌మ‌యంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర్ రావును కూడా ఈ ఇద్ద‌రు నేత‌లు క‌లిశారు. సిరిసిల్ల పవర్‌లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్‌చార్జిల భారంపై వివ‌రించారు. ఇందుకు సంబంధించి సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేశారు. వాటిని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్, ఎల్వీ ర‌మ‌ణ‌.
గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్.పి. వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుందని ఈ సంద‌ర్భంగా చెప్పారు. ,అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న ‘బ్యాక్ బిల్లింగ్’ భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడ్డాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 2016 నుండి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్.ఎస్.ఐ యూనిట్లపై అధికారులు రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని తెలిపారు. అది సర్‌చార్జిలతో కలిపి ఇప్పుడు రూ. 38 కోట్లకు చేరిందన్నారు.. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూత పడటంతో పాటు, ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డార‌ని వాపోయారు. ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి తెలంగాణ నేతన్నలను అదుకోవాలని కోరారు.
The post విద్యుత్ సంక్షోభం నుంచి నేత‌న్న‌ల‌ను కాపాడాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CP Sajjanar: వ్యూస్‌ మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా – సీపీ సజ్జనార్‌CP Sajjanar: వ్యూస్‌ మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా – సీపీ సజ్జనార్‌

CP Sajjanar : వ్యూస్‌ మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా అని హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ (CP Sajjanar) ప్రశ్నించారు. వ్యూస్‌, లైక్స్‌తో సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు చిన్నారుల భవిష్యత్‌ను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన

ఏకీకృత భారతదేశాన్ని జరుపు కోవాలి : స్టాలిన్ఏకీకృత భారతదేశాన్ని జరుపు కోవాలి : స్టాలిన్

చెన్నై : 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్. సోమ‌వారం ఆయ‌న జెండాను ఆవిష్క‌రించి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. తాము ఏక రూప భార‌త దేశాన్ని కోరుకోవ‌డం లేద‌ని అన్నారు.

Matsya-6000: సముద్ర అన్వేషణకు దేశీయ సముద్రయాన వాహనం మత్స్య–6000Matsya-6000: సముద్ర అన్వేషణకు దేశీయ సముద్రయాన వాహనం మత్స్య–6000

  సముద్ర అంతర్భాగంలోని రహస్యాలను ఛేదించడానికి భారత ఆక్వానాట్స్‌ రమేశ్‌ రాజు, జతీందర్‌పాల్‌ సింగ్‌ సిద్ధమవుతున్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ‘మత్స్య–6000’సముద్రయాన వాహనంలో వచ్చే ఏడాది ఆరంభంలో సాగర మథనం చేయబోతున్నారు. 28 టన్నుల బరువైన ఈ వాహనం సముద్రంలో