hyderabadupdates.com movies విన్యాసం మీదే బాక్సాఫీస్ ఆశలు

విన్యాసం మీదే బాక్సాఫీస్ ఆశలు

గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో నెట్టుకొస్తున్నా బిసి సెంటర్లలో కలెక్షన్లు తక్కువగానే ఉన్నాయి. ఫంకీ మూడు రోజులకే చేప చుట్టేయగా, హే బలవంత్ కూడా ఏమంత ప్రభావం చూపించేలా కనిపించడం లేదు.

జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామాల్లో సగానికి పైగా థియేటర్లు రాత్రి షోలు వేయడం ఆపేశాయని సమాచారం. కారణం కనీసం పది మంది ప్రేక్షకులు లేకపోవడమే. కొన్ని చోట్ల మ్యాట్నీలకు సైతం ఈ పరిస్థితి దాపురించింది. సంక్రాంతికి వచ్చిన హడావిడికి అచ్చం రివర్స్ లో చూస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు.

ఇప్పుడు అందరి చూపు రాబోయే విష్ణు విన్యాసం మీద ఉంది. శ్రీవిష్ణు హీరోగా రూపొందిన ఈ ఎంటర్ టైనర్ మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు రేగాయి. సింగల్ లాగా వినోదానికి లోటు లేకుండా టైం పాస్ చేయిస్తే చాలు యువత హిట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. కాకపోతే ఎంటర్ టైన్మెంట్ ఓ రేంజ్ లో ఉండాలి.

అలాని ఇదేమి చిన్న సినిమా కాదు. ఇరవై కోట్ల దాకా ఖర్చయ్యిందని ఇన్ సైడ్ టాక్. అంటే రికవరీ గట్టిగానే జరగాలన్న మాట. ఎలాగూ నవ్వించే సినిమాలు ఆడుతున్నాయి కాబట్టి విష్ణు విన్యాసం కూడా వాటి కోవలోకే చేరొచ్చని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఆయ్ ఫేమ్ నయన్ సారిక ఇందులో హీరోయిన్.

కాకపోతే సరిగ్గా విష్ణు విన్యాసం వచ్చిన వారం రోజులకే శ్రీవిష్ణు మరో మూవీ మృత్యుంజయ్ మార్చి 6 విడుదల కానుంది. నిజానికి ఈ రెండు క్లాష్ కావాల్సింది. అదృష్టవశాత్తు తప్పింది. అయినా సరే ఇది ఎక్కువ గ్యాప్ ఏమి కాదు. ముందైతే విష్ణు విన్యాసం యునానిమస్ అనిపించుకుంటే ఆ తర్వాత ఆ రిజల్ట్ మృత్యుంజయ్ కు సానుకూలంగా ఉంటుంది.

రెండు వేర్వేరు జానర్లు కాబట్టి పోలిక రాదు కానీ రెండూ మెప్పించడం అంటే శ్రీవిష్ణుకు సవాలే. గతంలో బాలయ్య, నాని ఈ విషయంలో ఇబ్బంది పడిన వైనం హిస్టరీలో ఉంది. విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ కనక హిట్ అయితే కనక శ్రీవిష్ణు ఖాతాలో అరుదైన మైలురాయి చేరుతుంది.

Related Post

ఏలూరు ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు..!ఏలూరు ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు..!

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అనేక మంది కొత్త నాయకులు విజయం దక్కించుకున్నారు. ఇలాంటి వారిలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బడేటి రాధాకృష్ణ గెలుపు గుర్రం ఎక్కారు. అయితే ఈయనకు పెద్ద విశేషమే ఉంది. 2004 నుంచి 2024 వరకు

ఇంకో సెంచరీ కొట్టేస్తే… హిస్టరీనేఇంకో సెంచరీ కొట్టేస్తే… హిస్టరీనే

ప్రదీప్ రంగనాథన్.. ఈ పేరు ఇప్పుడు సౌత్ ఇండియాలో ఒక సంచలనం. జయం రవి హీరోగా ‘కోమాలి’ అనే కామెడీ మూవీతో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. తర్వాత కొన్నేళ్లు ఈ కుర్రాడు కనిపించలేదు.

భారీ సక్సెస్ లేకున్నా లైనప్ లో 11 మంది దర్శకులుభారీ సక్సెస్ లేకున్నా లైనప్ లో 11 మంది దర్శకులు

సూర్య నటన గురించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కథలో దమ్ముంటే తను ఏ స్థాయిలో మెప్పిస్తాడో అందరికీ తెలిసిందే. కానీ బాక్సాఫీస్ దగ్గర అసలైన విజయం చూసి ఆయనకు చాలా కాలం అయ్యింది. 2013లో వచ్చిన ‘సింగం 2’ సినిమా