hyderabadupdates.com movies విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ తరహా వాతావరణం మరింత ఎక్కువగా ఉంటుంది. ఒకరు ఒకటంటే మరొకరు నాలుగంటారు. కానీ దీనికి భిన్నంగా మంత్రి నారా లోకేష్ మాత్రం తన పనితీరుతోనే విమర్శలకు సమాధానం చెబుతూ విమర్శకుల నోటికి తాళం వేస్తున్నారు. తాజాగా ఆయన ప్రతిష్టాత్మక వీక్ పత్రిక ముఖ చిత్ర కథనంలో మెరిసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సదరు పత్రిక నారా లోకేష్ పనితీరును పూసగుచ్చినట్టు వివరించింది. యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా లోకేష్ పనిచేస్తున్నారని తెలిపింది. తద్వారా నారా లోకేష్ మంత్రిగా ఏం చేశారు? ఏం సాధించారు? అన్న ప్రశ్నలకు పరోక్షంగా ఇది సమాధానంగా మారింది. ఇక పెట్టుబడుల విషయాన్ని కూడా ప్రధానంగా ఈ పత్రిక హైలైట్ చేసింది. విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.

ఈ క్రమంలో గత ఏడాది చేసిన పలు పర్యటనలకు సంబంధించిన వివరాలను ప్రస్తావించింది. ఎవరు ఎవరు నారా లోకేష్‌ను కలుసుకున్నారు? ఎంతెంత పెట్టుబడులకు సంబంధించి ఆయన కృషి చేశారు? ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ రాక వంటి అంశాలను ప్రధానంగా ఈ పత్రిక ప్రస్తావించింది. తద్వారా నారా లోకేష్ విదేశాలకు వెళ్లి ఏం తెచ్చారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు పస లేకుండా పోయింది. ఆధారాలు, విషయాలతో సహా పత్రిక తేటతెల్లం చేయడం గమనార్హం.

మొత్తంగా ఇప్పుడే కాదు గతంలోనూ నారా లోకేష్‌పై వచ్చిన, వస్తున్న విమర్శలకు ఆయన పనితీరే సరైన సమాధానమని తాజా కథనం స్పష్టం చేస్తోంది. నోటి నోరు అన్నట్టుగా కాకుండా మంత్రి లోకేష్ తన పని తీరుతోనే సమాధానం చెబుతుండటం మరింత విశేషం. ఏదేమైనా మంత్రి వ్యవహార శైలిపై ఇక నుంచి విమర్శలు చేయాలని భావించే వారు, కామెంట్లు చేయాలని అనుకునే వారు కూడా ఒకసారి ఆలోచించుకునేలా నారా లోకేష్ పనితీరు ఉండటం గమనార్హం.

Related Post

కోహ్లీ సెంచరీ.. టెన్షన్ పెట్టిన ఫ్యాన్కోహ్లీ సెంచరీ.. టెన్షన్ పెట్టిన ఫ్యాన్

విమర్శకుల నోళ్లు మూయించాలంటే విరాట్ కోహ్లీ బ్యాట్ మాట్లాడితే చాలు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కింగ్ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. “ఆట ఇప్పుడే మొదలైంది” అన్నట్లుగా ఆడి ఏకంగా తన 52వ వన్డే సెంచరీని పూర్తి

ఉస్తాద్ రీమేక్ గోల ఆపుతారా?ఉస్తాద్ రీమేక్ గోల ఆపుతారా?

రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక..  వరుసగా రీమేక్ సినిమాలే చేస్తూ వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో.. ఈ మూడూ వేర్వేరు భాషల నుంచి అరువు తెచ్చుకున్న కథలే. ఐతే