hyderabadupdates.com movies వృషకర్మ… జాక్ పాట్ కొట్టిందమ్మా

వృషకర్మ… జాక్ పాట్ కొట్టిందమ్మా

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం తలకిందులు అయ్యేంత సున్నితత్వం ప్రస్తుత ట్రెండ్ లో ఉంది. విశ్వంభరకు ఏం జరిగిందో చూశాం. దెబ్బకు ఏడాదికి పైగా రిపేర్లు చేస్తూనే ఉన్నారు. ఏదైతే చిరంజీవికి శాపంగా ఇబ్బంది పెట్టిందో అదే అంశం నాగచైతన్యకు వరంగా మారినట్టు వృషకర్మ బిజినెస్ చూస్తే అర్థమవుతుంది.

ట్రేడ్ సమాచారం మేరకు వృషకర్మ ఏపీ, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాలు కలిపి 45 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేసిందట. ఆ మేరకు ఒప్పందాలు అయిపోయాయని వినికిడి. ఇందులో అయిదు కోట్లు రికవరీ అడ్వాన్స్ ఉందని టాక్. ఈ హక్కులను సితార సంస్థ సొంతం చేసుకుందని అంటున్నారు. చైతుకిది బెస్ట్ డీల్ అవుతుంది. ఓవర్సీస్, నార్త్ ఇండియా, శాటిలైట్, ఆడియో కాకుండానే ఇంత మొత్తమంటే నిర్మాత టేబుల్ ప్రాఫిట్స్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహించిన వృషకర్మలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. హాలీవుడ్ స్థాయిలో వరల్డ్ బిల్డింగ్, రాక్షసుడైన విలన్, గుహల్లో రహస్యాలు, గుప్త నిధులు, ఫాంటసీ ప్రపంచాలు ఇలా బోలెడు వింతలు విశేషాలతో పాటు హారర్ కూడా జోడించారు. ఇలాంటి సినిమాలకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చే అజనీష్ లోకనాథ్ మరోసారి తన పనితనాన్ని బయట పెట్టబోతున్నట్టు టీజర్ శాంపిల్ లోనే అర్థమైపోయింది.

తండేల్ హిట్ తర్వాత ఏడాది బ్రేక్ తీసుకున్న నాగ చైతన్య వృషకర్మ కోసం చాలా కష్టపడ్డాడు. ఫిజికల్ గా రిస్క్ తీసుకున్నాడు. దానికి తగ్గట్టే అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో పాజిటివ్ టాక్ ఉంది. అసలే ఈ జానర్ కు మంచి డిమాండ్ ఉంది. కంటెంట్ క్లిక్ అయితే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. వేసవి విడుదల తేదీని ఇంకా నిర్ణయించలేదు. క్లాష్ లేకుండా సోలో రిలీజ్ కోసం చూస్తున్నారు. ఓటిటి డీల్ కూడా ఆల్మోస్ట్ అయ్యిందని తెలిసింది.

Related Post

శ్రీవిష్ణు ఇంకొంచెం జాగ్రత్త పడాలిశ్రీవిష్ణు ఇంకొంచెం జాగ్రత్త పడాలి

ఎంటర్ టైన్మెంట్ కింగని అభిమానులు పిలుచుకునే శ్రీవిష్ణు కొత్త సినిమా వస్తోందంటే మినిమమ్ ఫన్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. సింగిల్ లో పెద్ద కథేం లేకపోయినా కేవలం వినోదంతో హిట్టు కొట్టేసి నిర్మాతకు లాభాలు ఇచ్చింది. సామాజవరగమన లాంటివి ఘనవిజయం

రౌడీయిజాన్ని అణిచి వేస్తాం: చంద్ర‌బాబు వార్నింగ్రౌడీయిజాన్ని అణిచి వేస్తాం: చంద్ర‌బాబు వార్నింగ్

రాష్ట్రంలో రౌడీయిజాన్ని అణిచేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. కొంద‌రు గ‌త ఐదేళ్ల‌లో ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రించార‌ని.. దీంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని తెలిపారు. కొంద‌రు పోలింగ్ బూతుల‌ను కూడా ఆక్ర‌మించి ధ్వంసం చేశార‌ని.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌ల్నాడు జిల్లాలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను