hyderabadupdates.com movies వెంకటేష్ ఫ్యాన్స్ కోరుకున్నది ఇచ్చావ్

వెంకటేష్ ఫ్యాన్స్ కోరుకున్నది ఇచ్చావ్

అందరు స్టార్ హీరోల రీ రిలీజులు ఇప్పటిదాకా బోలెడు జరిగాయి కానీ ఒక్క వెంకటేష్ మాత్రమే ఇందులో వెనుకబడి ఉన్నారు. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా నిర్మాత సురేష్ బాబు తాను నిర్మాతైన బొబ్బిలి రాజా, కలిసుందాం రా, జయం మనదేరా లాంటివి మళ్ళీ విడుదల చేసేందుకు చొరవ చూపలేదు. బిజినెస్ కోణంలో అలోచించి ఆయన తీసుకున్న నిర్ణయం సబబే కానీ ఫ్యాన్స్ ఎమోషన్స్ ని కూడా పట్టించుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎట్టకేలకు వాళ్ళు కోరుకున్న క్షణం రానే వస్తోంది. వచ్చే ఏడాది జనవరి 1 నూతన సంవత్సర కానుకగా నువ్వు నాకు నచ్చావ్ థియేటర్లకు రానుంది.

నిజంగానే ఇది చాలా స్పెషల్ మెమరీ కానుంది. ఎందుకంటే నువ్వు నాకు నచ్చావ్ కు చాలా పెద్ద కల్ట్ ఫాలోయింగ్ ఉంది. కేవలం ఫ్యాన్స్ కి నచ్చిన ఎంటర్ టైనర్ కాదిది. ఇప్పటికీ టీవీ, యూట్యూబ్ లో చూసే ఫ్యామిలీ ఆడియన్స్ లక్షలు కాదు కోట్లలో ఉంటారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్నులో కామెడీ ప్లస్ ఎమోషన్ బలం తెలిసింది దీని ద్వారానే. దర్శకుడు విజయ్ భాస్కర్ అయినప్పటికీ మాటల మాంత్రికుడికి ఎక్కువ గుర్తింపు రావడం అతిశయోక్తి కాదు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో స్రవంతి రవికిశోర్ నువ్వు నాకు నచ్చావ్ నిర్మించారు. కమర్షియల్ హవాలోనూ ఈ మూవీ వంద రోజులు ఆడటం విశేషం.

హీరోగా వెంకటేష్ దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలి కలయికలో సినిమా ప్రారంభం కాబోతున్న టైంలో నువ్వు నాకు నచ్చావ్ విడుదల చేయడం ఒకరకంగా టైం మెషీన్ ప్రయాణం లాంటిది. పైగా పాతికేళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భం కన్నా మరొకటి రాదు. అదిరిపోయే వెంకటేష్ టైమింగ్, ఆర్తి అగర్వాల్ అందం, కోటి ఎవర్ గ్రీన్ సాంగ్స్, కామెడీ ఆర్టిస్టుల నిండైన నటన, హృద్యమైన ఎమోషన్లు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే విశేషాలతోనే ఒక పుస్తకం నిండిపోతుంది. బుల్లితెరపై మాత్రమే చూసిన ఇప్పటి జనరేషన్ ఖచ్చితంగా ఎక్స్ పీరియన్స్ అవ్వాల్సిన బిగ్ స్క్రీన్ మూవీ నువ్వు నాకు నచ్చావ్.

Related Post

ఏపీలో పెట్టుబ‌డులు-ఒప్పందాలు… ఆ సంద‌డే వేరు!ఏపీలో పెట్టుబ‌డులు-ఒప్పందాలు… ఆ సంద‌డే వేరు!

ఏపీలో వ‌రుస పెట్టుబ‌డులు.. అదే లైన్‌లో ఒప్పందాల జోరు పుంజుకుంది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వంలో నూత‌న సంద‌డి నెల‌కొంది. గురువారం కీల‌క కంపెనీ రెన్యూ ఎన‌ర్జీ సంస్థ 82 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టుల‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

Star heroine didn’t take remuneration for this film which was sent to OscarsStar heroine didn’t take remuneration for this film which was sent to Oscars

Janhvi Kapoor was part of Karan Johar’s Homebound, which is India’s official entry to the Oscars this year. The movie, which also stars Ishaan Khatter and Vishal Jetwal, is receiving

మరో రాజకీయ చెల్లి! అన్నతో విబేధాలు లేవంటూ..మరో రాజకీయ చెల్లి! అన్నతో విబేధాలు లేవంటూ..

తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న విశాఖ లో రంగ నాడు పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్