hyderabadupdates.com Gallery వెండి తెర‌పై ‘వనజీవి రామయ్య’ బయోపిక్

వెండి తెర‌పై ‘వనజీవి రామయ్య’ బయోపిక్

వెండి తెర‌పై ‘వనజీవి రామయ్య’ బయోపిక్ post thumbnail image

హైద‌రాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘కోటి మొక్కల రామయ్య’గా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ వెండితెరపైకి వ‌చ్చింది. సమాజానికి పర్యావరణ సందేశాన్ని అందించిన ఈ మహనీయుడి జీవితం ఆధారంగా రూపొందిన ‘వనజీవి రామయ్య’ బయోపిక్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డుల్లో బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ విభాగంలో ఎంపికైంది. నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో నిదిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి, భూషం రవీంద్రనాథ్, లింగంపల్లి చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమాకు బల్లేపల్లి మోహన్ సంగీతాన్ని అందించారు. తాజాగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, రాజ‌కీయ విశ్లేష‌కులు వి. ప్రకాష్, తన్నేరు బాబు రావు, నాగ మహేష్, సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరై చిత్రాన్ని అభినందించారు.
ఈ చిత్రాన్ని భారతీయ భాషల్లో కూడా విడుదల చేయాలని నిర్ణయించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. దర్శకుడు వేముగంటి మాట్లాడారు. కోటి మొక్కలు నాటి ప్రకృతికి సేవ చేసిన రామయ్య జీవితం భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలవాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. త్వరలోనే భారతీయ భాషల్లో కూడా ఈ బయోపిక్‌ను తీసుకురానున్నాం అని తెలిపారు. సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ కూడా ఇదే భావనను వ్యక్తం చేస్తూ, ఈ చిత్రాన్ని ప్రకృతి ప్రేమికుడు రామయ్యకు నివాళిగా అంకితం చేస్తున్నామని చెప్పారు.రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య పర్యావరణ పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. “వృక్షో రక్షతి రక్షితః” అనే నినాదాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఊరూరూ తిరిగిన ఆయన, శుభకార్యాల్లో మొక్కలను బహుమతులుగా ఇవ్వడం ద్వారా సరికొత్త ఆచారాన్ని నెలకొల్పారు. చెట్ల గింజలను సేకరించి అటవీ ప్రాంతాల్లో చల్లడం ఆయన నిత్యకృత్యంగా ఉండేది.
ప్రకృతిని ప్రేమించిన ఆ మహానుభావుడు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకృతి ఒడిలో కలిసి పోయినప్పటికీ, ఆయన చూపించిన మార్గం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ బయోపిక్ ద్వారా ఆయన సేవలు, స్ఫూర్తి మరింత విస్తృతంగా ప్రజలకు చేరవ కానున్నాయి.
The post వెండి తెర‌పై ‘వనజీవి రామయ్య’ బయోపిక్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్

KCR : కాంగ్రెస్‌ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కూడా గడవకుండానే… ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. పల్లెల్లోని రైతులే

అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత భార‌త్అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత భార‌త్

హ‌రారే : అండ‌ర్ -19 భార‌త జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. జింబాబ్వే లోని హ‌రారే వేదిక‌గా జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ జ‌ట్టును మ‌ట్టి క‌రిపించింది. ఏకంగా 100 ప‌రుగుల తేడాతో ఓడించింది. విశ్వ విజేత‌గా నిలిచింది.

Minister Nara Lokesh: ముగిసిన నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనMinister Nara Lokesh: ముగిసిన నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన

    రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ చేపట్టిన ఆస్ట్రేలియా పర్యటన నేటితో ముగిసింది. ఏడు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించిన లోకేష్.. వివిధ సంస్థలు, యూనివర్సిటీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించారు.