hyderabadupdates.com movies వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్ జరుగుతుంటే.. తన ఇంటి నుంచి క్యారియర్లు తెప్పించడం దాదాపు రోజూ జరిగే విషయమే. ఐతే వేరే రాష్ట్రంలో షూట్ జరుగుతుంటే అక్కడి ఫుడ్డే తినక తప్పదు.

కానీ ఒక రాష్ట్రంలో షూటింగ్‌లో పాల్గొంటూ ఇంకో రాష్ట్రం నుంచి క్యారియర్ తెప్పించుకోవడం అన్నది ఎప్పుడైనా విన్నామా? ప్రభాస్ ఖాతాలో ఈ ఘనత కూడా ఉందట. ఈ విషయాన్ని ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీంతో కలిసి చేసిన చిట్ చాట్ ఇంటర్వ్యూలో ప్రభాస్ వెల్లడించాడు.

దీని గురించి ముందే తెలుసుకున్న హీరో సంతోష్ శోభన్.. ఇది మరీ ఓవర్‌గా ఉందన్నా అంటూ వేరే రాష్ట్రం నుంచి మీరు క్యారియర్ తెప్పించుకున్న విషయం నిజమేనా అని అడిగాడు. దీనికి బదులిస్తూ.. ఆదిపురుష్ షూటింగ్ టైంలో జరిగిన విషయాన్ని పంచుకున్నాడు ప్రభాస్.

‘‘ఆదిపురుష్ ముంబయిలో జరుగుతుండగా.. ఒకసారి అందరం చీట్ మీల్ తిందాం అనుకున్నాం. అప్పుడు నాకు చెన్నై ఫుడ్ తినాలి, అందరికీ తినిపించాలి అనిపించింది. దీంతో ఆ ఫుడ్ తెప్పించాలని నిర్ణయించుకుని.. ఓం రౌత్ సహా టీంలో అందరికీ చెప్పా. వాళ్లు ఎదురు చూస్తూ ఉన్నారు.

తర్వాత లేటవుతుంటే.. ఏంటి ఇంకా రాలేదు అన్నారు. వస్తుంది, చెన్నై నుంచి రావాలి కదా అంటే.. అందరూ షాకైపోయారు. చెన్నై ఫుడ్ అంటే ముంబయిలోనే ఆ స్టయిల్లో చేసే రెస్టారెంట్ నుంచి తెప్పిస్తారని అనుకున్నాం కానీ.. ఇలా వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీలో ఫుడ్ తెప్పించడం ఏంటి అన్నారు.

చెన్నైలో ఇడియప్పం, బిరియాని చాలా బాగుంటాయి. హైదరాబాద్ బిరియానికి ఫేమస్సే కానీ.. చెన్నైలో వేరే స్టయిల్లో చేస్తారు. అది నాకు చిన్నప్పట్నుంచి ఇష్టం. అందుకే అక్కడ ఫేమస్ అయిన ఫుడ్ అంతా తెప్పించా. నాకు చెన్నై ఫుడ్ తినాలనిపించినపుడల్లా ఇలాతెప్పిస్తుంటా.

తాజాగా ఫుడ్ చేయించి ఒక మనిషిని పెట్టి క్యారియర్‌తో ఫ్లైట్ ఎక్కించి ముంబయికి రప్పించాను. అక్కడ్నుంచి ఫుడ్ వచ్చాక వేడి వేడిగా వడ్డిస్తే అందరూ ఇష్టంగా తిన్నారు’’ అని ప్రభాస్ వెల్లడించాడు. ప్రభాస్ తిండి ప్రేమ, అతిథులకు పెట్టే విందు భోజనాల గురించి చాలా విన్నాం కానీ.. ఇలా వేరే రాష్ట్రం నుంచి ఫుడ్ తెప్పించడం ఏంటయ్యా అంటూ అందరూ అవాక్కవుతున్నారు.

Related Post

రామ్-లక్ష్మణ్ మాస్టర్స్… ఎంత బాగా చెప్పారోరామ్-లక్ష్మణ్ మాస్టర్స్… ఎంత బాగా చెప్పారో

ఇండస్ట్రీలో ఎవ్వరైనా సరే.. ఎప్పటికీ హవా సాగించలేరు. ఏదో ఒక సమయంలో జోరు తగ్గుతుంది. మారుతున్న కాలానికి తగ్గట్లు అప్‌డేట్ కాకపోవడం వల్లో, కాలం కలిసి రాకో అవకాశాలు తగ్గుతాయి. ఆదరణ కోల్పోతారు. కానీ తాము నిష్క్రమించాల్సిన సమయం వచ్చినపుడు దాన్ని

విచారణ వేళ విజయసాయి ట్వీట్‌… బీజేపీపై ప్రశంసలు!విచారణ వేళ విజయసాయి ట్వీట్‌… బీజేపీపై ప్రశంసలు!

ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కోనున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ట్వీట్లతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. ఇటీవల ‘కోటరీలు’, ‘వెనిజులా అధ్యక్షుడు’ అంటూ చేసిన ట్వీట్‌ ద్వారా వైఎస్ జగన్‌ను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు