hyderabadupdates.com Gallery వైఎస్సార్ పాద‌యాత్ర‌కు 23 ఏళ్లు : జ‌గ‌న్

వైఎస్సార్ పాద‌యాత్ర‌కు 23 ఏళ్లు : జ‌గ‌న్

వైఎస్సార్ పాద‌యాత్ర‌కు 23 ఏళ్లు : జ‌గ‌న్ post thumbnail image

అమ‌రావ‌తి : మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న తండ్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేసిన పాద‌యాత్ర గురించి ప్ర‌స్తావించారు. గురువారం ఎక్స్ వేదిక‌గా గుర్తు చేశారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒక నాయ‌కుడు చేసిన పాద‌యాత్ర రాష్ట్ర చ‌రిత్ర‌ను తిర‌గ రాయ‌గ‌ల‌ద‌ని నిరూపించిందన్నారు. నాడు నాన్న చేపట్టిన పాద‌యాత్ర అని పేర్కొన్నారు. నాకు బాగా గుర్తు ఏప్రిల్ 9, 2003లో ఎర్ర‌టి ఎండ‌లో ప్ర‌జ‌ల క‌ష్టాల్లో పాలు పంచుకునేందుకు నాన్న చేప‌ట్టిన ఆ పాద‌యాత్ర రాష్ట్ర ప్ర‌జ‌ల హృద‌యాల్లో ధైర్యం నింపిందని పేర్కొన్నారు. నేనున్నాన‌నే భ‌రోసా ఇచ్చింద‌న్నారు.
నాన్న‌కు రాష్ట్రం మొత్తం మ‌ద్ద‌తుగా నిలిచి ముఖ్య‌మంత్రిని చేసింద‌ని చెప్పారు. నాన్న సీఎం కాగానే ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంత‌కం చేసిన ద‌గ్గ‌రి నుంచి ఆయ‌న తీసుకు వ‌చ్చిన ఎన్నో సంస్క‌ర‌ణ‌లు, ప‌థ‌కాలు రాష్ట్ర రూపు రేఖలే కాదు దేశానికి కూడా ఆద‌ర్శంగా మారాయ‌న్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రైతును రాజుగా నిలిపాయి. అక్క‌చెల్లెమ్మ‌లు వారి సొంత కాళ్ల‌పై నిల‌బ‌డేలా చేశాయి. బడుగు, బలహీన వర్గాలకు బతుకుపై భరోసానిచ్చాయని పేర్కొన్నారు జ‌గ‌న్ రెడ్డి. ఎంతో మంది పేద పిల్ల‌లు డాక్ట‌ర్లుగా, ఇంజినీర్లుగా, క‌లెక్ట‌ర్లుగా అయ్యేలా చేశాయని తెలిపారు. ఎన్నో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ఆంధ్రుల జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రుగులు పెట్టించారు. విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయం, పారిశ్రామిక రంగాల్లో నాన్న వేసిన ఆ ముద్రను ఎవరూ చెరిపేయలేనిది. నాన్న చేప‌ట్టిన పాద‌యాత్ర నేటికి 23 ఏళ్లు అయిన సంద‌ర్భాన్ని గుర్తు చేసుకుంటూ నా ఈ ప్ర‌యాణం కొనసాగుతుందని స్ప‌ష్టం చేశారు.
The post వైఎస్సార్ పాద‌యాత్ర‌కు 23 ఏళ్లు : జ‌గ‌న్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మాట నిల‌బెట్టుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్మాట నిల‌బెట్టుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను ఉన్నంత వ‌ర‌కు పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ఒక్క‌రు ఇబ్బంది ప‌డ‌కుండా చూస్తాన‌ని అన్నారు. శ‌నివారం పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా

పశు సంవర్ధక రంగానికి స‌ర్కార్ భారీ ఊరటపశు సంవర్ధక రంగానికి స‌ర్కార్ భారీ ఊరట

అమరావతి : రాష్ట్రంలో పశు సంవర్ధక రంగాన్ని బలోపేతం చేస్తూ పశు పోషకులు, చిన్న రైతులకు పెద్ద ఎత్తున ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జారీ

YS Jagan: అక్రమాస్తుల కేసులో మెమో దాఖలు చేసిన మాజీ సీఎం జగన్YS Jagan: అక్రమాస్తుల కేసులో మెమో దాఖలు చేసిన మాజీ సీఎం జగన్

    ఆంధ్ర‌ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. యూరప్ పర్యటన తర్వాత ఈనెల 14 లోపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని