hyderabadupdates.com movies వైఫ్ ఆఫ్ చైతు.. పా.రంజిత్‌తో

వైఫ్ ఆఫ్ చైతు.. పా.రంజిత్‌తో

తెలుగమ్మాయిలు తెలుగులో గుర్తింపు సంపాదించడమే కష్టం అంటే.. బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ మంచి రేంజికి వెళ్లింది శోభిత ధూళిపాళ్ల. ఇంటగెలిచి రచ్చ గెలవాలి అంటారు కానీ.. ఆమె రచ్చ గెలిచి ఇంటికి వచ్చింది. తన సినిమా కెరీర్ లాగే వ్యక్తిగత జీవితం కూడా ఎవ్వరూ ఊహించని టర్న్ తీసుకుంది. సమంత నుంచి విడిపోయిన టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య.. శోభితతో డేటింగ్ చేసి తర్వాత ఆమెను పెళ్లాడాడు. గత ఏడాది వీరి పెళ్లి సింపుల్‌గా జరిగింది. 

పెళ్లి తర్వాత శోభిత ఫిలిం కెరీర్‌ నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. కొత్త సినిమాలు, సిరీస్‌లు ఏవీ ఒప్పుకోలేదు. గ్యాప్ పెరుగుతుండడంతో ఇక ఆమె సినిమాలు మానేస్తుందా అన్న సందేహాలు కూడా కలిగాయి. కానీ శోభిత ఇప్పుడు కొత్త సినిమాను అంగీకరించింది. అది తమిళంలో, ఒక విలక్షణ దర్శకుడితో కావడం విశేషం. ‘అట్టకత్తి’తో మొదలుపెట్టి ‘తంగలాన్’ వరకు వైవిధ్యమైన సినిమాలతో దర్శకుడిగా బలమైన ముద్ర వేసిన పా.రంజిత్ దర్శకత్వంలో శోభిత నటిస్తోంది.

‘వెట్టువమ్’ పేరుతో రంజిత్ తీస్తున్న కొత్త చిత్రంలో ఆమె కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఆర్య, వీఆర్ దినేష్ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. హీరోలతో సమానమైన పవర్ ఫుల్ రోల్‌లో శోభిత నటిస్తోందట. సమాజంలో అణగారిన వర్గాలకు సంబంధించి సామాజిక అంశాలతో సినిమాలు తీసే పా.రంజిత్ తన శైలికి భిన్నంగా.. ఒక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. వచ్చే ఏడాది వేసవిలో ‘వెట్టువమ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

Related Post

No fun, only thrill: Allari Naresh sets expectations for 12A Railway ColonyNo fun, only thrill: Allari Naresh sets expectations for 12A Railway Colony

Allari Naresh has been doing different films lately, and up next, he will be seen in the suspense thriller 12A Railway Colony. Directed by Nani Kasaragadda, the movie features Kamakshi

రోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలురోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మొదటి విడతలోనే రూ. 2,123 కోట్ల సాస్కీ నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల