hyderabadupdates.com movies వైభవ్ సూర్యవంశీ… ఎందుకంత తొందర?

వైభవ్ సూర్యవంశీ… ఎందుకంత తొందర?

​రాజస్థాన్ రాయల్స్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టీమ్ ఇండియా ఎంట్రీపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్‌పై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది వైభవ్ సృష్టించిన విధ్వంసం చూసి, అతన్ని వెంటనే జాతీయ జట్టులోకి తీసుకోవాలని మహమ్మద్ కైఫ్, మైఖేల్ వాన్ వంటి మాజీలు డిమాండ్ చేస్తున్నారు.

అయితే అశ్విన్ మాత్రం వీరి వాదనతో విభేదించారు. వైభవ్ ఇంకా చిన్నపిల్లాడని, ఇప్పుడే అతన్ని అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిలోకి నెట్టడం సరికాదని తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పష్టం చేశారు. వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ చూస్తుంటే అతని బ్యాట్ స్పీడ్ అద్భుతంగా ఉందని అశ్విన్ మెచ్చుకున్నారు. గౌహతి లాంటి కష్టమైన పిచ్‌పై కూడా ఏ ఒక్క బ్యాటర్ ఆడలేకపోయిన షాట్లను వైభవ్ చాలా సులువుగా ఆడాడని కొనియాడారు. 

అతని ధాటికి చెన్నై బౌలర్లు నిస్సహాయంగా మారిపోయారని, రాజస్థాన్ జట్టు ఈసారి టైటిల్ రేసులో బలంగా ఉందని చెప్పడానికి వైభవ్ ఆటతీరే నిదర్శనమని అశ్విన్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, టీమ్ ఇండియా ఎంపిక విషయంలో మాత్రం తొందరపాటు వద్దని గట్టిగా చెప్పారు. ​వైభవ్ వయసు ఇప్పుడు కేవలం 15 ఏళ్లే అని, అతనికి ఇంకా రెండున్నర దశాబ్దాల క్రికెట్ భవిష్యత్తు ఉందని అశ్విన్ గుర్తు చేశారు.

ఎంఎస్ ధోనీ 44 ఏళ్ల వరకు ఆడుతున్నప్పుడు, వైభవ్ కూడా 40 ఏళ్ల వరకు ఆడినా అతనికి చాలా సమయం ఉందని వివరించారు. “అతన్ని ఇప్పుడే ఒక టార్గెట్ లాగా చూడకండి, స్వేచ్ఛగా వదిలేయండి. సమయం వచ్చినప్పుడు తనంతట తానే జట్టులోకి వస్తాడు. అంత టాలెంట్ ఉన్న ఆటగాడు ఎలాగూ ఇండియాకు ఆడతాడు, కానీ మనకు ఎందుకంత తొందర?” అని అశ్విన్ ప్రశ్నించారు.

​వైభవ్ సూర్యవంశీ రికార్డులు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. గతేడాది 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. అండర్ 19, ఇండియా A జట్ల తరపున ఆడుతూ ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాశాడు. జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవడానికి కావాల్సిన అన్ని అర్హతలు వైభవ్ దగ్గర ఉన్నప్పటికీ, చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు ఇస్తే అతని సహజసిద్ధమైన ఆట దెబ్బతినే ప్రమాదం ఉందనేది అశ్విన్ తెలిపారు. ప్రతిభ ఉంది కదా అని వెంటనే ప్రయోగాలు చేయవద్దని సూచించారు. ​ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో వైభవ్ పేరు మారుమోగిపోతోంది. ముఖ్యంగా సీఎస్‌కే లాంటి పెద్ద టీమ్‌ను చిత్తు చేయడంలో అతను చూపించిన తెగువ చూసి సెలక్టర్లు కూడా ఆలోచనలో పడ్డారు. 

అయితే అశ్విన్ చెప్పినట్లుగా, ఒక యంగ్ టాలెంట్‌ను కాపాడుకోవాలంటే అతనికి సరైన సమయం ఇవ్వడం చాలా ముఖ్యం. తొందరపడి జట్టులోకి తీసుకుని, ఒకవేళ ఫెయిల్ అయితే ఆ కుర్రాడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అందుకే వైభవ్ ఎప్పుడు అరంగేట్రం చేస్తాడనే దానికంటే, అతను ఎంత కాలం నిలకడగా రాణిస్తాడనేదే కీలకం అను మరికొందరు చెబుతున్నారు.

Related Post

‘వారణాసి’ గొడవని ఎలా పరిష్కరిస్తారు‘వారణాసి’ గొడవని ఎలా పరిష్కరిస్తారు

గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ జరగడానికి కొద్దిరోజుల ముందు వారణాసి అనే పేరుతో ఒక సినిమా పోస్టర్ అధికారికంగా రిలీజయ్యింది. చాలా మంది దీన్ని లైట్ తీసుకున్నారు. బహుశా రాజమౌళి వేరే పేరు పెట్టుకున్నారేమో అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఎస్ఎస్ఎంబి 29

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారిట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ విడుదల కాబోతోంది. ఆ మరుసటి రోజు రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లైన్ లో ఉంది.

Buzz: Casting completed for the much-delayed Telugu film Power PetaBuzz: Casting completed for the much-delayed Telugu film Power Peta

Power Peta was announced long ago by director Krishna Chaitanya with Nithiin as the protagonist. However, Nithiin exited the project for unknown reasons, and later Vishwak Sen’s name came into