hyderabadupdates.com movies శిరీష్ పెళ్లి వెనుక వరుణ్, నితిన్

శిరీష్ పెళ్లి వెనుక వరుణ్, నితిన్

టాలీవుడ్లో మరో సెలబ్రెటీ పెళ్లికి రంగం సిద్ధమైంది. అల్లు అరవింద్ పిల్లల్లో అందరి కంటే చిన్నవాడైన శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నయనిక అనే అమ్మాయితో ప్రేమలో పడ్డ శిరీష్.. ఇటీవలే తనతో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఘనంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకకు మెగా కుటుంబమంతా తరలివచ్చి త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న జంటను ఆశీర్వదించింది. ఈ ఫొటోలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఐతే శిరీష్‌కు నయనిక ఎలా పరిచయం.. ఆమె నేపథ్యం ఏంటి.. వీరి ప్రేమ ఎలా మొదలైంది అని సోషల్ మీడియాలో జనాలు వెతికేస్తున్నారు. వివరంగా కాకపోయినా.. బ్రీఫ్‌గా నయనికతో తమ ప్రేమ గురించి సమాచారం ఇచ్చాడు శిరీష్. ఒక సోషల్ మీడియా పోస్టు ద్వారా అతను ఈ సీక్రెట్ బయటపెట్టేశాడు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లే.. నయనికతో తన ప్రేమకు పునాది అని శిరీష్ వెల్లడించాడు. వరుణ్, లావణ్యల పెళ్లి తర్వాత యంగ్ హీరో నితిన్, అతడి భార్య షాలిని కలిసి ఒక పార్టీ ఇచ్చారట. 

ఆ వేడుకకు షాలిని బెస్ట్ ఫ్రెండ్ అయిన నయనిక కూడా వచ్చిందట. తొలిసారి తనను అప్పుడే చూశాడట శిరీష్. నాటి పరిచయం తర్వాత తామిద్దరం ప్రేమలో పడ్డామని.. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నామని శిరీష్ తెలిపాడు. ఏదో ఒక రోజు తమ పిల్లలు తమ ప్రేమ గురించి అడుగుతారని.. ఆ రోజు ఇదే చెబుతానని శిరీష్ తెలిపాడు. తనను తమ ఫ్రెండ్స్ సర్కిల్ లో చేర్చుకున్న నయనిక స్నేహితులందరికీ శిరీష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాడు. శిరీష్-నయనికల పెళ్లి ఫిబ్రవరిలో జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related Post

Daaku Maharaaj OST Delayed Again as Thaman Misses Release DateDaaku Maharaaj OST Delayed Again as Thaman Misses Release Date

Daaku Maharaaj was Balakrishna’s film released during the last Sankranthi. Bobby Kolli directed this mass action drama, with Pragya Jaiswal and Shraddha Srinath playing the leading ladies. The film’s composer,

మార్కెటింగ్ అవసరం లేని కొత్త పాఠంమార్కెటింగ్ అవసరం లేని కొత్త పాఠం

వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027 ఏప్రిల్ లో వచ్చే వారణాసి కోసం రాజమౌళి ఇప్పటి నుంచే విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. టైటిల్ లాంచ్ కోసమే