hyderabadupdates.com movies శివాజీ సరే మరి జై హనుమాన్ సంగతేంటి

శివాజీ సరే మరి జై హనుమాన్ సంగతేంటి

దర్శకుడు ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన అయోమయం ఇంకా తొలగడం లేదు. హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ ప్రకటించి ఏడాది దాటేసింది. రిషబ్ శెట్టి హీరోగా ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. ఒక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు.

కాంతార చాప్టర్ 1 తర్వాత తాను చేయబోయే మూవీ ఇదేనని, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ తాజా పరిణామాలు చూస్తే జై హనుమాన్ కన్నా ముందు ఛత్రపతి శివాజీ బృందంతో రిషబ్ శెట్టి చేరబోతున్నాడని అర్థమవుతోంది. దానికి కారణాలు లేకపోలేదు.

ఇటీవలే కర్ణాటకలో జరిగిన ఒక డివోషనల్ ఈవెంట్ కి వివేక్ ఒబేరాయి అతిథిగా వచ్చాడు. రిషబ్ సాదరంగా ఆహ్వానించడమే కాక పరస్పరం ఇద్దరూ సన్మానించుకుని గౌరవం ప్రకటించుకున్నారు. ఛత్రపతి శివాజీలో వివేక్ ఒబెరాయ్ ఉండటం గమనించాల్సిన విషయం. అంటే జై హనుమాన్ పక్కకు వెళ్లి ఇది ముందుకు వచ్చిందనే అనుమానం వస్తోంది.

ప్రస్తుతం రిషబ్ శెట్టి చాలా టైట్ కమిట్మెంట్స్ లో ఉన్నాడు. జై హనుమాన్ కాకుండా మరో మూడు ప్యాన్ ఇండియా మూవీస్ ఒప్పుకున్నాడు. వాటిలో సితార ఎంటర్ టైన్మెంట్స్ తీయబోయే భారీ బడ్జెట్ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగిపోతోంది.

ఒకవేళ జై హనుమాన్ ఆలస్యమయ్యే పక్షంలో ప్రశాంత్ వర్మ ఏం చేస్తాడనేది అంతు చిక్కని ప్రశ్న. ఆల్రెడీ రణ్వీర్ సింగ్ ప్రాజెక్టు చేయి జారింది. ఓపెనింగ్ దాకా రాబోయిన నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ క్యాన్సిల్ అయ్యింది. కొన్ని నెలల క్రితం నిర్మాత నిరంజన్ రెడ్డితో ఆర్థిక లావాదేవీలా గురించి నోటీసుల పర్వం కొనసాగింది.

ఫిలిం ఛాంబర్ లో ఇంకా పంచాయితీ తెగలేదట. ఇంత సందిగ్ధం ఉన్నా తన పర్యవేక్షణలో ఇతర దర్శకులతో ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో భాగంగా తీస్తున్న ఇతర సినిమాలు నిక్షేపంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరి జై హనుమాన్ వ్యవహారం ఎప్పుడు తేలుతుందో చూడాలి.

Related Post

Prime Video Drops Tense Trailer of Telugu Crime Thriller CheekatiloPrime Video Drops Tense Trailer of Telugu Crime Thriller Cheekatilo

Prime Video has unveiled the gripping trailer of its upcoming Telugu original movie Cheekatilo, creating strong buzz among thriller lovers. Set against the fast-changing urban landscape of Hyderabad, the film

పెట్టుబడులకోసం లుక్కు మార్చిన లోకేష్పెట్టుబడులకోసం లుక్కు మార్చిన లోకేష్

విశాఖ‌లో నిర్వ‌హిస్తున్న పెట్టుబ‌డుల భాగ‌స్వామ్య స‌ద‌స్సులో మంత్రి నారా లోకేష్ కొత్త లుక్‌లో క‌నిపించనున్నారు. అంటే ఆయ‌న ఆహార్యం, వేషం మారిపోతుంద‌ని కాదు.. ప్ర‌పంచ స్థాయి నాయకుల‌ను, వివిధ దేశాల‌కు చెందిన అధికారుల‌ను , పారిశ్రామిక వేత్త‌ల‌ను నారా లోకేష్ స్వ‌యంగా