hyderabadupdates.com movies శ్రీలీల, మహేష్ మధ్య ఏం జరిగింది?

శ్రీలీల, మహేష్ మధ్య ఏం జరిగింది?

నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను బాగానే ఆకట్టుకుంది. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ గా జరిగిన ఈవెంట్లో పవన్ చాలా కూల్ గా కనిపించాడు. అలాగే మాట్లాడాడు కూడా. టికెట్ రేట్లు, ఫ్యాన్ వార్స్ సహా అనేక విషయాలపై పవన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.

అదే సమయంలో ఇంకో టాపిక్ సోషల్ మీడియాను ముంచెత్తింది. పవన్ ప్రసంగిస్తుండగా.. ఆయన పక్కనే హీరోయిన్ శ్రీలీల నిలబడి ఉండగా.. తన వెనుక జబర్దస్త్ టీవీ షో ఫేమ్, ‘రంగస్థలం’ సినిమాతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ శ్రీలీలను ఏదో చేశాడంటూ సామాజిక మాధ్యమాల్లో ఒక చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి ఒక వీడియో వైరల్ కూడా అవుతోంది.

ఆ వీడియోలో సడన్‌గా శ్రీలీల వెనక్కి తిరిగి చూసింది. మహేష్ నవ్వాడు. తిరిగి శ్రీలీల ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. తిరిగి నవ్వలేదు. పైగా సీరియస్ లుక్ ఇచ్చింది. దీంతో మహేష్ ఏదో చేసి ఉంటాడంటూ అతన్ని ట్రోల్ చేస్తున్నారు. కొందరేమో పవన్ మాట్లాడుతుంటే మహేష్ ఫోన్ చూస్తున్నాడని.. అందుకే శ్రీలీల సీరియస్ అయిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో మహేష్ దీని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

అంతకుముందు శ్రీలీల గారు నన్ను ఫోన్ పట్టుకోమని ఇచ్చారు. తర్వాత ఆవిడ వెనక్కి తిరిగి నా వైపు చూసేసరికి ఫోన్ కోసం చూస్తున్నారు అనుకున్నా. ఈ లోపు ఆవిడ స్క్రీన్ వైపు పైకి చూసారు. జరిగింది అంతే. ఇక్కడ ఎవరిని అగౌరవ పరచవద్దు అని మహేష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. మరి ఈ విషయంలో శ్రీలీల ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. ఉస్తాద్ భగత్ సింగ్ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే

View this post on Instagram

Related Post

“Killer” Promises a Bold New Sci-Fi Experience: Director Suku Poorvaj“Killer” Promises a Bold New Sci-Fi Experience: Director Suku Poorvaj

The upcoming Telugu science-fiction thriller “Killer” is creating strong buzz with its fresh concept, futuristic visuals, and powerful performances. Starring Jyothi Poorvaj, Poorvaj, and Manish Gilada, the film aims to

ఫ‌రియా అబ్దుల్లా తండ్రి అలా… త‌ల్లి ఇలాఫ‌రియా అబ్దుల్లా తండ్రి అలా… త‌ల్లి ఇలా

జాతిర‌త్నాలు సినిమాతో క‌థానాయిక‌గా చాలా మంచి పేరు సంపాదించింది హైద‌రాబాద్ అమ్మాయి ఫ‌రియా అబ్దుల్లా. లోక‌ల్ హీరోయిన్ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌ని తెలుగు సినిమ‌ల్లో ఫ‌రియా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఆమె.. ఆ త‌ర్వాతు