hyderabadupdates.com Gallery శ్రీ‌వాణి నిధుల‌తో 5 వేల దేవాలయాల నిర్మాణం

శ్రీ‌వాణి నిధుల‌తో 5 వేల దేవాలయాల నిర్మాణం

శ్రీ‌వాణి నిధుల‌తో 5 వేల దేవాలయాల నిర్మాణం post thumbnail image

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను వచ్చే 2 ఏళ్లల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడారు. శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించడం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ ఆలయాల నిర్మాణ బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని ఆలోచన చేస్తున్నాం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలోనూ 25-30 వరకూ ఆలయాలను నిర్మించే అవకాశం ఉంటుందన్నారు సీఎం. స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. వారి నుంచి ప్రతిపాదనలు తీసుకుని నిర్మాణం చేపట్టాల‌ని సూచించారు.
ఆలయాల నిర్మాణానికి సంబంధించి మూడు రకాల డిజైన్లతో పైలెట్ ప్రాజెక్టుగా నిర్మించాలని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. వీటి నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతీ దేవాలయానికీ ప్రహరీ నిర్మాణం చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రం లోని 22 ప్రముఖ దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు సిద్దంగా ఉన్నాయన్నారు. మిగిలిన దేవాలయాలకు కూడా మాస్టర్ ప్లాన్‌లను త్వరితగతిన రూపొందించాలని ఆదేశించారు.
The post శ్రీ‌వాణి నిధుల‌తో 5 వేల దేవాలయాల నిర్మాణం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్లు సీఎస్కేకు అత్యంత కీల‌కంఆ ఇద్ద‌రు ఆట‌గాళ్లు సీఎస్కేకు అత్యంత కీల‌కం

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ వ్యాఖ్యాత‌, ఎన‌లిస్ట్ హ‌ర్షా భోగ్లే ఐపీఎల్ 2026 మెగా టోర్నీకి సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం 10 జట్లు ఐపీఎల్ క‌ప్ కోసం త‌ల‌ప‌డేందుకు రెడీ అయ్యాయి. ఈ టోర్నీ అధికారికంగా మార్చి 28న

ఛ‌త్రప‌తి శివాజీ మ‌హారాజ్ బాట‌లో అజిత్ ప‌వార్ న‌డిచారుఛ‌త్రప‌తి శివాజీ మ‌హారాజ్ బాట‌లో అజిత్ ప‌వార్ న‌డిచారు

ముంబై : త‌న భ‌ర్త‌, దివంగ‌త మ‌రాఠా రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ ఛ‌త్ర‌పతి శివాజీ మ‌హారాజ్ బాట‌లో న‌డిచార‌ని అన్నారు భార్య, ఉప ముఖ్య‌మం్త‌రి సునేత్ర ప‌వార్. గురువారం ఛ‌త్ర‌ప‌తి జ‌యంతి సంద‌ర్బంగా శివనేరి కోటలో ఏర్పాటు చేసిన

PM Narendra Modi: దిల్లీ పేలుడు ఘటన బాధితులకు ప్రధాని మోదీ పరామర్శPM Narendra Modi: దిల్లీ పేలుడు ఘటన బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ

    దిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న కారు పేలుడు ఘటనలో గాయపడిన వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న వెంటనే నేరుగా ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి వెళ్లారు. గాయపడిన వారితో మాట్లాడి, త్వరగా కోలుకోవాలని