hyderabadupdates.com movies శ్రీవారి సన్నిధిలో రాజకీయలు ఎందుకు రోజా గారు

శ్రీవారి సన్నిధిలో రాజకీయలు ఎందుకు రోజా గారు

తిరుమల కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా కోట్లాది మంది భక్తులు ఇక్కడ స్వామివారి దర్శనానికి వస్తుంటారు. సామాన్య భక్తులతో పాటు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు సైతం మొక్కులు చెల్లించుకుంటారు. రోజుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఈ పవిత్ర క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడటం టీటీడీ ప్రధాన బాధ్యతగా భావిస్తోంది.

ఈ నేపథ్యంలో తిరుమలలో రాజకీయాలు, ద్వేషపూరిత వ్యాఖ్యలకు ఎలాంటి స్థానం లేదని టీటీడీ ట్రస్ట్ బోర్డు ఇప్పటికే స్పష్టంగా ప్రకటించింది. ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది. తిరుమల కొండపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నదే టీటీడీ స్పష్టమైన ఆదేశం ఉంది.

అయితే, ఇటువంటి ఆంక్షలు ఉన్నప్పటికీ శ్రీవారి సన్నిధిలో మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తిరుమలలో దర్శనం అనంతరం ఆమె మాట్లాడుతూ ‘జగనన్న మళ్లీ సీఎం కావాలి’ అని కోరుకున్నట్లు తెలిపారు. పవిత్ర క్షేత్రంలో రాజకీయ ఆకాంక్షలు వ్యక్తపరచడం సరైందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వాస్తవానికి తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం రోజాకు ఇదే మొదటిసారి కాదు. గతంలో వైసీపీ అధికారాన్ని కోల్పోయిన కొత్తలోనే, తిరుమల కొండపై నుంచే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆమె వ్యాఖ్యానించారు. అప్పట్లోనే ఆమె వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఘోర పరాజయం తర్వాత కూడా ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదని, పవిత్ర స్థలాల గౌరవాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారనే విమర్శలు మరోసారి వినిపిస్తున్నాయి.

Related Post

హనుమాన్ దర్శకుడి మౌనం బద్దలయ్యేనాహనుమాన్ దర్శకుడి మౌనం బద్దలయ్యేనా

దర్శకుడు ప్రశాంత్ వర్మ మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అగ్ర నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్సులు తీసుకుని ఎవరికీ ఎప్పుడు ఏ సినిమా చేస్తాడో సరైన క్లారిటీ ఇవ్వడం లేదని, దీంతో నిర్మాతలు ఆయన మీద మహా గుస్సాగా

Hollywood film The Lost Bus trolled for allegedly copying Prabhas’ Salaar BGM
Hollywood film The Lost Bus trolled for allegedly copying Prabhas’ Salaar BGM

Prabhas’ blockbuster Salaar is going viral again on social media, but this time for an unexpected reason. Fans have noticed that a portion of the background score in the promo