hyderabadupdates.com movies శ్రీవిష్ణు సంకటం ఎవరికీ వద్దు

శ్రీవిష్ణు సంకటం ఎవరికీ వద్దు

ఇమేజ్, మార్కెట్ ఉన్న హీరో సినిమాలు రెండు కేవలం ఒకే రోజు గ్యాప్ తో విడుదల కావడం చాలా ఇబ్బందికరమైన విషయం. గతంలో బాలకృష్ణ, నాని ఇది అనుభవించారు కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో భారీ మార్పులు వచ్చేశాయి. వాళ్ళిద్దరి హయాంలో ఓటిటిలు లేవు. న్యాచురల్ స్టార్ టైంలో ఇంటర్ నెట్ ఉంది కానీ 5జి ఇంకా పరిచయం కానీ రోజులువి.

కానీ ఇప్పుడలా లేదు. ఆడియన్స్ మరీ అడ్వాన్స్ అయిపోయారు. నిర్ణయాలు చాలా హార్ష్ గా తీసుకుంటున్నారు. పాజిటివ్ టాక్ వచ్చినా సరే వెంటనే థియేటర్లకు పరిగెత్తడం లేదు. ట్రెండ్ కు తగ్గట్టు తాము కోరుకుంటున్నవి లేకపోతే ప్రేమకథలను కూడా పట్టించుకోవడం లేదు.

అలాంటిది శ్రీవిష్ణు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో వరసగా మృత్యుంజయ్, విష్ణు విన్యాసంతో వస్తున్నాడు. ఓటిటితో ముందే చేసుకున్న అగ్రిమెంట్లు ఇతరత్రా కారణాలతో ఏ నిర్మాత వెనుకడుగు వేయలేని సీన్ ఉండటంతో వేరే ఆప్షన్ లేకుండా విడుదలకు రెడీ చేయడం చూసి అభిమానులే ఆశ్చర్యపోతున్నారు.

ఇప్పుడు దేనికి ఎక్కువ ప్రమోషన్ జరుగుతుందనేది కీలకం. మనిషికి రెండు కళ్ళు ముఖ్యమన్నట్టు ఫలానా దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మరొకటి లైట్ తీసుకోవడానికి లేదు. గత డిసెంబర్ లో సైక్ సిద్దార్థ, వనవీర రిలీజప్పుడు నందు లాంటి సపోర్టింగ్ ఆర్టిస్ట్ కం హీరోనే ఈ విషయంలో చిన్నపాటి వివాదాన్ని చవి చూడాల్సి వచ్చింది.

మరి ఇంత గుర్తింపు ఉన్న శ్రీవిష్ణుకి ఈ చిక్కు తలెత్తితే ఎంతైనా సమస్యేగా. కాకపోతే రెండు సంబంధం లేని డిఫరెంట్ జానర్లు కావడం ఊరట కలిగించే విషయం. అసలే ఫిబ్రవరి చాలా డ్రైగా ఉంది. థియేటర్లకు పబ్లిక్ పెద్దగా రావడం లేదు. మల్టీప్లెక్సుల్లో సగం షోలు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి నెలకొంది. సంక్రాంతి హడావిడి అయిపోయాక నిశ్శబ్దం తాండవిస్తోంది.

కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కొంత నెట్టుకొస్తున్నాయి కానీ అది సరిపోవడం లేదు. సో బాక్సాఫీస్ కు ఊపు తెచ్చే బాధ్యత శ్రీవిష్ణు మీద ఉంది. ఒక సినిమా అయితే ఫుల్ ఫోకస్ పెట్టేవాడు కానీ ఇప్పుడు బాధ్యతనుం సమంగా పంచి ఆయా నిర్మాతలకు న్యాయం చేయాల్సి ఉంటుంది.

Related Post

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్లో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ వాళ్లు నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే బన్నీ, అట్లీ ఇద్దరికీ విడివిడిగా భారీ

OG యునివర్స్ గురించి పవన్ & సుజిత్
OG యునివర్స్ గురించి పవన్ & సుజిత్

మొదటి వారం కాకుండానే 250 కోట్ల గ్రాస్ దాటేసిన ఓజి అంచనాలకు మించి ఆడటం టీమ్ నే కాదు మొత్తం మెగా ఫ్యామిలీనే సంతోషంలో ముంచెత్తింది. కుటుంబం మొత్తం ఒక సినిమాని కలిసి చూడటం గత కొన్నేళ్లలో చిరంజీవికి కూడా జరగలేదు.