hyderabadupdates.com Gallery శ్రీ కోదండ రామస్వామి కళ్యాణం ఘ‌నంగా నిర్వ‌హించాలి

శ్రీ కోదండ రామస్వామి కళ్యాణం ఘ‌నంగా నిర్వ‌హించాలి

శ్రీ కోదండ రామస్వామి కళ్యాణం ఘ‌నంగా నిర్వ‌హించాలి post thumbnail image

ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఒంటిమిట్టలోని టీటీడీ సమావేశ మందిరంలో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు. వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని నిర్వ‌హంచే క‌ళ్యాణోత్స‌వ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఏప్రిల్ 1న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు రానున్నార‌ని తెలిపారు. ఇందులో భాగంగా శ్రీ కోదండ రామస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సమర్పించే పట్టు వస్త్రాల కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ ఏర్పాట్ల వివరాలను మంత్రి ఎస్. స‌విత‌కు వివరించారు. సవిత మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శ్రీ కోదండ రాముడి క‌ళ్యాణోత్స‌వానికి దాదాపు ల‌క్ష‌కు పైగా భ‌క్త బాంధ‌వులు రానున్నార‌ని , ముంద‌స్తు ఏర్పాట్లు భారీగా చేయాల‌ని సూచించారు మంత్రి స‌విత‌. ఈ సంద‌ర్బంగా టీటీడీ జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం మాట్లాడుతూ ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు చేశామ‌ని, అన్ని శాఖ‌ల తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామ‌ని తెలిపారు . సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు ఇప్ప‌టికే ఒంటిమిట్ట‌లో నిత్య అన్న‌దానం కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్ట‌డం జ‌రిగింద‌న్నారు. ఈ సమావేశంలో టీటీడీ, జిల్లా ,పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.
The post శ్రీ కోదండ రామస్వామి కళ్యాణం ఘ‌నంగా నిర్వ‌హించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Jupally Krishna Rao: బీఆర్‌ఎస్‌ పాలనపై మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్Minister Jupally Krishna Rao: బీఆర్‌ఎస్‌ పాలనపై మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్

    బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అరాచకాలన్నీ ప్రజలకు తెలుసని, ఆ పార్టీకి మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఎర్రగడ్డ డివిజన్‌లోని గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, కళ్యాణ్‌ నగర్‌ వెంచర్‌ త్రీ, రాజీవ్‌నగర్‌

తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవంతిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం

తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పార్వేట‌ ఉత్సవం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. గోదా పరిణయోత్సవం కూడా కన్నుల పండువ‌గా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్‌ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు

జ‌న‌సేన పార్టీ స‌భ్య‌త్వానికి ప‌వ‌న్ రూ. 2 కోట్లు విరాళంజ‌న‌సేన పార్టీ స‌భ్య‌త్వానికి ప‌వ‌న్ రూ. 2 కోట్లు విరాళం

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం, జన‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆదివారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీకి సంబంధించి క్రియాశీల‌క స‌భ్య‌త్వ నమోదు కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్బంగా త‌న