hyderabadupdates.com Gallery సంజు శాంస‌న్ అత్యంత ప్ర‌మాద‌క‌ర ఆట‌గాడు

సంజు శాంస‌న్ అత్యంత ప్ర‌మాద‌క‌ర ఆట‌గాడు

సంజు శాంస‌న్ అత్యంత ప్ర‌మాద‌క‌ర ఆట‌గాడు post thumbnail image

చెన్నై : ఈసారి ఐపీఎల్ 2026లో ప‌లుసార్లు ఛాంపియ‌న్ గా గెలుపొంద‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు అనుకోకుండా వ‌రుస‌గా మూడు మ్యాచ్ ల‌లో ప‌రాజ‌యం పాలైంది. ఈ స‌మ‌యంలో ఏరికోరి ఏకంగా రూ. 18 కోట్లు ఖ‌ర్చు చేసింది సీఎస్కే ఒకే ఒక్క ఆట‌గాడు కేర‌ళ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్ కోసం. అంతే కాదు త‌న జ‌ట్టు నుంచి ఇద్దరు ముఖ్య‌మైన ఆట‌గాళ్లు సామ్ క‌ర‌న్ , ర‌వీంద్ర జ‌డేజాల‌ను అప్ప‌గించింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు. ఇదే క్ర‌మంలో ఇండియాలో జ‌రిగిన ఇండియా, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హించిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో దుమ్ము రేపాడు సంజు శాంస‌న్ . త‌ను కేవ‌లం 5 ఇన్నింగ్సులు ఆడి 321 ర‌న్స్ చేశాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. దీంతో నేష‌న‌ల్ హీరోగా మారి పోయాడు శాంస‌న్. ఇక చెన్నై జ‌ట్టుకు తిరుగులేద‌ని భావించారు త‌మిళ తంబీలు.
కానీ ఊహించ‌ని విధంగా వ‌రుస‌గా 9,6,7 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు శాంస‌న్. అంద‌రూ త‌న‌ను తిట్ట‌డం ప్రారంభించారు. కానీ నిన్న చెన్నై వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ఢిల్లీ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. సెంచ‌రీతో క‌దం తొక్కాడు. 15 ఫోర్లు 4 భారీ సిక్స‌ర్ల‌తో త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. జ‌ట్టుకు విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు. ఈ సంద‌ర్బంగా సీఎస్కే జ‌ట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియాతో మాట్లాడాడు. సంజు శాంస‌న్ చాలా ఆధిపత్యం చెలాయించగల ఆటగాడు. అంతే కాదు మోస్ట్ డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్ అంటూ పేర్కొన్నాడు. ఇదే స‌మ‌యంలో సంజు శాంస‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. త‌న సెంచ‌రీని స్టీఫెన్ ఫ్లెమింగ్ కు అంకితం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.
The post సంజు శాంస‌న్ అత్యంత ప్ర‌మాద‌క‌ర ఆట‌గాడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఏపీ పంచాయ‌తీరాజ్ కు సీఎం చంద్ర‌బాబు కంగ్రాట్స్ఏపీ పంచాయ‌తీరాజ్ కు సీఎం చంద్ర‌బాబు కంగ్రాట్స్

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంతోషం వ్య‌క్తం చేశారు. కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో ప్ర‌గ‌తి ప‌రుగులు తీస్తోంద‌న్నారు. ఇందులో భాగంగా అన్ని రంగాలను మ‌రింత బ‌లోపేతం చేయ‌డంపై ఫోక‌స్ పెట్టామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా కేంద్ర

అభివృద్దికి న‌మూనా ప్ర‌జా పాల‌న : సీఎంఅభివృద్దికి న‌మూనా ప్ర‌జా పాల‌న : సీఎం

ఖ‌మ్మం జిల్లా : వైరా ప‌ట్ట‌ణం అభివృద్ది కోసం రూ. 200 కోట్లు మంజూరు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైరా పట్టణంలో భారీ ర్యాలీ మరియు కార్నర్ మీటింగ్‌ నిర్వహించడం జరిగింది.