hyderabadupdates.com Gallery సంజు శాంస‌న్ త‌న స‌త్తా ఏమిటో చూపించాడు

సంజు శాంస‌న్ త‌న స‌త్తా ఏమిటో చూపించాడు

సంజు శాంస‌న్ త‌న స‌త్తా ఏమిటో చూపించాడు post thumbnail image

కోల్ క‌తా : భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ , బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. కోల్ క‌తా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో టీం ఇండియా వెస్టిండీస్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజ‌యంలో ముఖ్య భూమిక పోషించాడు కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్. త‌ను ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేశాడు. విండీస్ చేతిలోకి దాదాపు వెళ్లిన మ్యాచ్ ను భార‌త్ ముంగిట్లోకి తీసుకు వ‌చ్చాడు. త‌ను కేవ‌లం 50 బంతులు మాత్ర‌మే ఆడాడు. ఇందులో 12 ఫోర్లు 4 భారీ సిక్సులు ఉన్నాయి. మొత్తం 97 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. జ‌ట్టు గెలుపు సాధించేంత వ‌ర‌కు నిద్ర పోలేదు త‌ను. గ‌త కొంత కాలంగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. తొట్రుపాటుకు గురి కాకుండా సంయ‌మ‌నంతో ఆడాడు. ఇండియాను సెమీ ఫైన‌ల్ కు చేర్చాడు శాంస‌న్.
ఈ సంద‌ర్బంగా గంగూలీ స్పందించాడు. సంజు గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను ఏమిటో, త‌న‌లో ఉన్న స‌త్తా ఏపాటిదో ఈ మ్యాచ్ ద్వారా ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించాడ‌ని కితాబు ఇచ్చాడు గంగూలీ. ఇదిలా ఉండ‌గా గత ఆరు నెలలుగా జట్టులో చోటు దక్కించుకునేందుకు నానా తంటాలు ప‌డ్డాడు. ఇషాన్ కిషన్ ఓపెనింగ్ అయినా లేదా మరెవరైనా వచ్చినా జట్టులో చోటు దక్కించు కోలేక పోయాడు. ప్రపంచ కప్‌కు ముందు, సంజు మళ్లీ విఫలమయ్యాడని, అతను జట్టులో చోటు దక్కించు కోలేడని, భారత్‌లో ఇంత ప్రతిభ ఉందని, శుభ్‌మాన్ గిల్ ఎందుకు లేడని ప్ర‌శ్న‌లు వెల్లువ‌లా వ‌చ్చాయి. కానీ క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో అనూహ్యంగా వ‌చ్చాడు. స‌త్తా చాటాడు. ఇండియాకు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన గెలుపు అందించాడ‌ని పేర్కొన్నాడు దాదా.
The post సంజు శాంస‌న్ త‌న స‌త్తా ఏమిటో చూపించాడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Delhi: ఢిల్లీ పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలుDelhi: ఢిల్లీ పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు

    ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనతో కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అయితే, ఈ ఘటనలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బాంబు బ్లాస్ట్ ఘటనలో ఇప్పటివరకు

Sabarimala: శబరిమలలో అన్నదాన సత్రంలో రోజూ 10 వేలమందికి ఆహారంSabarimala: శబరిమలలో అన్నదాన సత్రంలో రోజూ 10 వేలమందికి ఆహారం

    కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో పెద్దఎత్తున అన్నదానం నిర్వహిస్తున్నారు. మలికప్పురం ఆలయం వెనుక ఉన్న ఈ సత్రంలో