hyderabadupdates.com Gallery సంజూ శాంస‌న్ ఆడ‌డంపై గంభీర్ నో క్లారిటీ

సంజూ శాంస‌న్ ఆడ‌డంపై గంభీర్ నో క్లారిటీ

సంజూ శాంస‌న్ ఆడ‌డంపై గంభీర్ నో క్లారిటీ post thumbnail image

ముంబై : ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో వ‌రుస‌గా విజ‌యాలు సాధించినా ఆ జ‌ట్టును, మేనేజ్ మెంట్ ను ప్ర‌ధాన స‌మ‌స్య వెంటాడుతూనే ఉంది. ప‌నిగ‌ట్టుకుని స్టార్ ప్లేయ‌ర్లు శాంస‌న్, అభిషేక్ శ‌ర్మ‌ల‌ను ప్ర‌మోట్ చేశారు ఓపెన‌ర్లుగా. కానీ విచిత్రం ఏమిటంటే ఇద్ద‌రూ ఆశించిన మేర రాణించ‌లేక పోయారు. అంచ‌నాల‌కు ద‌గ్గ‌ర‌గా రాలేక పోవ‌డంతో జ‌ట్టు హెడ్ కోచ్ , మేనేజ్మ‌మెంట్ పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ప్ర‌స్తుతం డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉన్న భార‌త్ ప్ర‌స్తుతం సూప‌ర్ 8కి చేరుకుంది. జ‌ట్టు అన్ని విభాగాల‌లో బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన స‌మ‌స్య ఓపెనింగ్ విష‌యంలోనే . ఇక వ‌ర‌ల్డ్ లో నెంబ‌ర్ 1 బ్యాట‌ర్ గా పేరు పొందాడు అభిషేక్ శ‌ర్మ‌.
కానీ అనూహ్యంగా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వ‌రుస‌గా డకౌట్ల‌తో నిరాశ ప‌రిచాడు. అంద‌రినీ విస్తు పోయేలా చేశాడు. ఈ త‌రుణంలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సందీప్ కిష‌న్ రంగంలోకి వ‌చ్చాడు. సూప‌ర్ ప‌ర్ ఫార్మెన్స్ తో ఆక‌ట్టుకున్నాడు. మ‌రో వైపు శాంస‌న్ ఇంకా ప‌రుగుల కోసం నానా తంటాలు ప‌డుతున్నాడు. ఈ త‌రుణంలో గంభీర్ ప్ర‌యోగాల‌కు తెర తీస్తాడా లేక అభిషేక్ శ‌ర్మ‌ను ఇలాగే కంటిన్యూ చేస్తాడా అనేది ఉత్కంఠ నెల‌కొంది. ఒక‌వేళ అలాగే కొన‌సాగిస్తే జ‌ట్టులోని ఇత‌ర ఆట‌గాళ్ల‌పై ఒత్తిడి మ‌రింత పెరుగుతుంది. ఇప్పుడు ఒత్తిడికి లోను కాకుండా ఆడేవాళ్లు కావాలి. ఇదిలా ఉండ‌గా టోర్నీలో భాగంగా అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మ‌వుతోంది భార‌త జ‌ట్టు. టోర్నీలో బ‌ల‌మైన టైటిల్ ఫెవ‌రేట్ గా ఉన్న స‌ఫారీల‌తో త‌ల‌ప‌డ‌నుంది.
The post సంజూ శాంస‌న్ ఆడ‌డంపై గంభీర్ నో క్లారిటీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

వెంకన్నఆగ్రహానికి గురికాక తప్పదు : సవితవెంకన్నఆగ్రహానికి గురికాక తప్పదు : సవిత

అమరావతి : హిందువుల మనోభావాలు దెబ్బతినేలా శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంకన్న ఫొటోలను సభలో విచ్చలవిడిగా పడేసి అపచారానికి పాల్పడ్డారని, ఆ కలియుగ దైవం

ఎంఎస్ ధోనీ అస‌లైన వార‌సుడు సంజూ శాంస‌న్ఎంఎస్ ధోనీ అస‌లైన వార‌సుడు సంజూ శాంస‌న్

ముంబై : రేప‌టి నుంచి మెగా ఐపీఎల్ టోర్నీ 2026 ప్రారంభం కానుంది. ఈ త‌రుణంలో భారీ ఎత్తున అంచ‌నాలు నెల‌కొన్నాయి ఆయా జ‌ట్ల‌పై. ప్ర‌ధానంగా ముగ్గురు కీల‌క‌మైన ఆట‌గాళ్లైన మ‌హేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌పై క‌ళ్లు

ఓటు ప్ర‌క్షాళ‌న వెనుక భారీ కుట్ర : రేవంత్ రెడ్డిఓటు ప్ర‌క్షాళ‌న వెనుక భారీ కుట్ర : రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కార్య‌క‌ర్త‌ల గెలుపు కోసం తాను గ‌ల్లీ గ‌ల్లీ కాదు ఇంటింటికీ వెళ్లి ప్ర‌చారం చేస్తాన‌ని అన్నారు. 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో లో 80 శాతం మహాత్మా