hyderabadupdates.com Gallery స‌త్తా చాటిన భార‌త్ తేలి పోయిన పాకిస్తాన్

స‌త్తా చాటిన భార‌త్ తేలి పోయిన పాకిస్తాన్

స‌త్తా చాటిన భార‌త్ తేలి పోయిన పాకిస్తాన్ post thumbnail image

శ్రీ‌లంక : కోట్లాది మంది ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసిన కీల‌క‌మైన దాయాదుల పోరులో చిట్ట చివ‌ర‌కు భార‌త కుర్రాళ్లు స‌త్తా చుట్టారు. సూర్య భాయ్ కెప్టెన్సీలో విజ‌య ప‌రంప‌ర కొన‌సాగిస్తూనే ఉంది టీమిండియా. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ మెగా టోర్నీలో వ‌రుస‌గా భార‌త జ‌ట్టుకు ఇది ఎనిమిదో విజ‌యం కావ‌డం విశేషం. ముందుగా బ‌రిలోకి దిగిన భార‌త్ స్టార్ బ్యాట‌ర్ అభిషేక్ శ‌ర్మ‌ను కోల్పోయింది. దీంతో అభిమానులు నిరాశ‌కు లోన‌య్యారు. కానీ ఇషాన్ కిష‌న్ పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు ఆ ఛాన్స్ ఇవ్వ‌లేదు. ధ‌నా ధ‌న్ ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. చుక్క‌లు చూపించాడు. సిక్సులు, ఫోర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 175 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని పాకిస్తాన్ ముందు ఉంచింది.
అనంత‌రం మైదానంలోకి దిగిన పాకిస్తాన్ ఏ కోశానా భార‌త బౌల‌ర్ల‌ను ఎదుర్కోలేక పోయింది. మూడు ఓవ‌ర్ల‌లోనే మూడు ప్ర‌ధాన వికెట్ల‌ను కోల్పోయింది. 114 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. గ్రూప్ -ఏలో జ‌రిగిన ఈ కీల‌క పోరు చివ‌ర‌కు ఏక‌ప‌క్షంగా సాగింది. ఇషాన్ కిష‌న్ 40 బంతులు ఎదుర్కొని 77 ర‌న్స్ చేశాడు. ఇందులో 10 ఫోర్లు , 3 సిక్సులు ఉన్నాయి. సూర్య కుమార్ యాద‌వ్ 29 బంతుల్లో 32 చేశాడు. ఇక పాకిస్తాన్ జ‌ట్టులో ఉస్మాన్ ఖాన్, షాహిన్ అఫ్రిది మాత్ర‌మే ఆడారు. ఖాన్ 44 ర‌న్స్ చేస్తే అఫ్రిదీ 23 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక భార‌త బౌల‌ర్ల‌లో హార్దిక్ 2 , బుమ్రా 2, వ‌రుణ్ , అక్ష‌ర్ చెరో 2 వికెట్ల చొప్పున తీశారు. పాకిస్తాన్ ను కోలుకోలేకుండా చేశారు.
The post స‌త్తా చాటిన భార‌త్ తేలి పోయిన పాకిస్తాన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్ర‌శాంత్ కిషోర్ పిట‌ష‌న్ సుప్రీంకోర్టు తిర‌స్క‌ర‌ణప్ర‌శాంత్ కిషోర్ పిట‌ష‌న్ సుప్రీంకోర్టు తిర‌స్క‌ర‌ణ

న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది జ‌న సురాజ్ పార్టీ చీఫ్‌, ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిష‌ర్ కు. శుక్ర‌వారం ఆయ‌న గ‌త ఏడాది బీహార్ లో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో పెద్ద

సైకిల్ ఎక్కిన నారా చంద్ర‌బాబు నాయుడుసైకిల్ ఎక్కిన నారా చంద్ర‌బాబు నాయుడు

చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌నంగా మారారు. త‌న వ‌య‌సు 75 ఏళ్లు. కానీ ఆయ‌న ఇప్ప‌టికీ చ‌లాకీగా ఉంటారు. నిత్యం ప‌నిలో నిమ‌గ్న‌మై ఉంటారు. అంతే కాదు ముఖ్య‌మంత్రిగా పాల‌నా ప‌రంగా నిత్యం చైత‌న్య‌వంతంగా