hyderabadupdates.com Gallery స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ చెన్నై సూప‌ర్ కింగ్స్

స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ చెన్నై సూప‌ర్ కింగ్స్

స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ చెన్నై సూప‌ర్ కింగ్స్ post thumbnail image

హైద‌రాబాద్ : ఐపీఎల్ 2026లో కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది శ‌నివారం హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ స్టేడియం. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది. ఇప్ప‌టికే టికెట్లు పూర్తిగా అమ్ముడు పోయాయి. బ్యాటింగ్, బౌలింగ్ ప‌రంగా ఇరు జ‌ట్లు బ‌లంగా ఉన్నాయి. ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. మ్యాచ్ గెలుపులో టాస్ కూడా కీల‌కం కానుంది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో హైద‌రాబాద్ జ‌ట్టులో యంగ్ బౌల‌ర్లు త‌మ ప్రతాపం చూపించారు. ప్ర‌పుల్ హింగే, ష‌కీబ్ హుస్సేన్ ల బౌలింగ్ దెబ్బ‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విల విల లాడింది. ఆ జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌కు హైద‌రాబాద్ బ్రేక్ వేసింది.
దీంతో అంద‌రి క‌ళ్లు ఈ ఇద్ద‌రి బౌలింగ్ పై ఉన్నాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ 216 ర‌న్స్ చేసింది. స్కిప్ప‌ర్ ఇషాన్ కిష‌న్ స‌త్తా చాటాడు. 95 ర‌న్స్ చేశాడు. ఫోర్లు , సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. ఆ త‌ర్వాత ఫుల్ ఫామ్ లో ఉన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను హైద‌రాబాద్ బౌలర్లు క‌ట్ట‌డి చేశారు. 159 ప‌రుగుల‌కే చాప చుట్టేశారు. ఇక ఐదు సార్లు ఛాంపియ‌న్ గా ఉన్న సీఎస్కే ఇప్పుడు వ‌రుస‌గా తొలి మూడు మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది. ఆ త‌ర్వాత రెండు మ్యాచ్ ల‌లో గెలిచింది. ఆయుష్ మాత్రే, సంజూ శాంస‌న్ లు ఫామ్ లోకి రావ‌డం ఒకింత ప్ల‌స్ పాయింట్. రేపు ఎలా ఆడ‌తార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.
The post స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ చెన్నై సూప‌ర్ కింగ్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

నూతన వడ్డెర సొసైటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్నూతన వడ్డెర సొసైటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

తాడేపల్లి/అమరావతి : తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఎన్నికల ముందు మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు వడ్డెర సొసైటీలకు మైనింగ్

దాయాదుల పోరులో ‘దాదా’ ఎవ‌రో ..?దాయాదుల పోరులో ‘దాదా’ ఎవ‌రో ..?

శ్రీ‌లంక : అస‌లైన పోరాటానికి వేదిక కానుంది శ్రీ‌లంక దేశ రాజ‌ధాని కొలంబో న‌గ‌రం. ఇప్ప‌టికే కోట్లాది మంది దాయాదుల మ‌ధ్య జ‌రిగే కీల‌క‌మైన మ్యాచ్ కోసం ఉత్కంఠ‌త‌తో ఎదురు చూస్తున్నారు. త‌ట‌స్థ వేదిక‌గా దుబాయ్ లో జ‌రిగిన మ్యాచ్ లో