hyderabadupdates.com movies సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకుంది. అనుష్క, నయనతారల తర్వాత తనకంటూ ఒక ఇమేజ్, మార్కెట్ సంపాదించుకున్న అరుదైన కథానాయికల్లో ఆమె ఒకరు. ఐతే కథానాయికలు మరీ ఎక్కువ కాలం టాప్‌లో కొనసాగడం కష్టం. వయసు పెరిగి, గ్లామర్ తగ్గాక కెరీర్ డౌన్ అవుతుంది.

పైగా సమంత పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిల్ కావడం.. తర్వాత విడాకులు తీసుకోవడం.. అనారోగ్యం పాలవడంతో కెరీర్‌కు అనుకున్నట్లుగా ముందుకు సాగలేదు. ముఖ్యంగా విడాకులు, అనారోగ్యం వల్ల సమంత తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కోవడంతో ఒక దశలో సమంత లుక్స్ కూడా దెబ్బ తిన్న మాట వాస్తవం. ఆమె ఒక రకమైన వేదనలో కనిపించడం అభిమానులను ఎంతో బాధించింది.

ఐతే అనారోగ్యం నుంచి కోలుకోవడంతో పాటు మళ్లీ కొత్త తోడును వెతుక్కోవడం.. ఇటీవలే రాజ్ నిడిమోరును పెళ్లి కూడా చేసుకోవడంతో సమంతలో మళ్లీ జోష్ వచ్చింది. పెళ్లి తర్వాత సామ్ తొలిసారిగా రాజ్‌తో కలిసి తాజాగా పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చింది. ఈ సందర్భంగా సమంతను చూసి అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. సమంత ఇప్పుడు చాలా  సంతోషంగా ఉన్న సంగతి స్పష్టంగా కనిపించింది. తన ముఖంలో మునుపటి గ్లో వచ్చింది. 

వ్యక్తిగత జీవితంలో జరిగే పరిణామాలు మనిషి మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో చెప్పడానికి సమంతనే ఉదాహరణ. ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉన్న విషయం ముఖంలో ప్రతిబింబిస్తోంది. సామ్ మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతుండడం కూడా అభిమానులకు ఆనందాన్నిస్తోంది.

ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ టీజర్ ఇటీవలే రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సక్సెస్ అయి సమంతలో మరింత ఆనందాన్ని నింపాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related Post

ఇల్లా మాట్లాడితే నవ్వుకుంటారు బండిఇల్లా మాట్లాడితే నవ్వుకుంటారు బండి

చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు వచ్చాయి. మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ

Rukmini Vasanth Joins Yash’s ‘Toxic’, Poster Unveils Her Role as MellisaRukmini Vasanth Joins Yash’s ‘Toxic’, Poster Unveils Her Role as Mellisa

The makers of Rocking Star Yash’s much-awaited film Toxic: A Fairytale for Grown-Ups have unveiled a major update that has heightened excitement among fans. Actress Rukmini Vasanth has been officially