hyderabadupdates.com movies సమయం సరిపోక ‘సాబ్’ ఉక్కిరిబిక్కిరి

సమయం సరిపోక ‘సాబ్’ ఉక్కిరిబిక్కిరి

ఈ రోజు మినహాయిస్తే రాజా సాబ్ విడుదలకు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే టైం ఉంది. తెలుగు వరకు ప్రమోషన్లు బాగానే చేశారు. రెండు టీజర్లు, ఒక థియేట్రికల్ ట్రైలర్ కలిపి మొత్తం తొమ్మిది నిమిషాల వీడియో కంటెంట్ ద్వారా సినిమాలో ఏముందనేది స్పష్టంగా చెప్పేశారు. రెండు పాటలు భారీగా కాకపోయినా ఉన్నంతలో మంచి రీచ్ తెచ్చుకున్నాయి.

ముందు రోజు ప్రీమియర్లు దాదాపు ఖరారైనట్టే. టికెట్ రేట్లు ఫిక్సయ్యాక షోలు డిసైడవుతాయి. ఇదంతా బాగానే ఉంది కానీ ఉత్తరాదిలో రాజా సాబ్ హడావిడి పెద్దగా కనిపించడం లేదని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. కారణం ప్రమోషన్లు జోరుగా లేకపోవడమే.

అఖండ 2 తాండవం కోసం బాలయ్య టీమ్ ముంబై నుంచి అయోధ్య దాకా చాలా చోట్లు తిరిగింది. ఫలితం వచ్చిందా లేదానేది పక్కన పెడితే ఈ మాత్రం ఎఫర్ట్స్ ఇప్పుడు చాలా అవసరం. కానీ రాజా సాబ్ దగ్గర అంత టైం లేదు. స్పిరిట్ షూట్ మంచి స్వింగ్ లో ఉంది. సందీప్ రెడ్డి వంగా ఆగకుండా తీస్తున్నారు.

మధ్యలో గ్యాప్ వస్తే ప్రభాస్ దాన్ని వాడుకుని మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాడు. సో ఇప్పుడు ప్రత్యేకంగా బాలీవుడ్ పబ్లిసిటీ కోసం ఎక్కువ డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మారుతీ చివరి దశ పనుల్లో బిజీగా ఉండటంతో అటువైపు ప్రత్యేకంగా దృష్టి సారించడం సాధ్యపడటం లేదని ఇన్ సైడ్ టాక్.

నిర్మాతల ధీమా వేరుగా ఉంది. గత కొన్నేళ్లుగా ఉధృతంగా ఉన్న హారర్ కామెడీ జానర్ లో ప్రభాస్ సినిమా చేశాడు కాబట్టి ప్రత్యేకంగా దానికి ప్రమోషన్లు చేయకపోయినా ఆడియన్స్ థియేటర్లకు వస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. ఎలాగూ పాజిటివ్ టాక్ వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు వసూళ్లు అవే వస్తాయని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

అదెలా అంటే దురంధర్ ని ఉదాహరణగా చూపిస్తున్నారు. కానీ రాజా సాబ్ క్యాటగిరి వేరు కాబట్టి దాంతో పోల్చలేం కానీ రిలీజయ్యాక స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. కంటెంట్ కనెక్ట్ అయితే చాలు రోజుల తరబడి అర్ధరాత్రి షోలు చూసేందుకు సైతం అక్కడి జనాలు క్యూ కడతారు.

Related Post

ఓజీ నిర్మాత‌తో గొడ‌వ‌.. సుజీత్ ఏమ‌న్నాడంటే?ఓజీ నిర్మాత‌తో గొడ‌వ‌.. సుజీత్ ఏమ‌న్నాడంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్లో హైయెస్ట్ గ్రాస‌ర్‌గా రికార్డు నెల‌కొల్పింది ఓజీ సినిమా. అభిమానుల‌కు విందు భోజ‌నం లాంటి సినిమాను అందించి వాళ్లకు దేవుడిలా మారిపోయాడు సుజీత్. ఈ సినిమాతో నిర్మాత డీవీవీ దాన‌య్య కూడా మంచి లాభాలే అందుకున్న‌ట్లు

సర్ప్రైజ్.. కిరణ్ అబ్బవరంతో అనిరుధ్?సర్ప్రైజ్.. కిరణ్ అబ్బవరంతో అనిరుధ్?

‘రాజా వారు రాణి వారు’ అనే చిన్న సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఏ బ్యాగ్రౌండ్ లేకుండానే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఎస్ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే, వినరో భాగ్యము విష్ణు కథ లాంటి చిత్రాలతో ఓ మోస్తరు