hyderabadupdates.com Gallery స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తేనే క‌లెక్ట‌ర్లుగా కొన‌సాగిస్తాం

స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తేనే క‌లెక్ట‌ర్లుగా కొన‌సాగిస్తాం

స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తేనే క‌లెక్ట‌ర్లుగా కొన‌సాగిస్తాం post thumbnail image

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను ఉద్దేశించి. ఆషామాషీగా ఐఏఎస్ లు కాలేర‌ని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుందని అన్నారు. క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారని, ఆ విష‌యం గుర్తించి ప‌నితీరుపై ఫోక‌స్ పెట్టాల‌న్నారు సీఎం. కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించక పోతే ఎప్పటికీ మీకు ప్రజల సమస్యలు అర్థం కావు అని అన్నారు.కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులేన‌ని ఆ విష‌యం మ‌రిచి పోవ‌ద్ద‌ని సూచించారు. కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేయాలని స్ప‌ష్టం చేశారు.
మార్చి 6 నుంచి జూన్ 12 వరకు “ ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని అన్నారు సీఎం. గ్రామాల వారీగా సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు, లబ్ధిదారుల వివరాలను గ్రామసభల్లో చదివి వినిపించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్య‌త మీపైనే ఉంద‌న్నారు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయని, ప్రతీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఒక అధికారికి బాధ్యత ఇవ్వాలని అన్నారు. ఆ అధికారి విద్యార్థులతో పాటు పాఠశాలలో భోజనం చేయాల్సిందేన‌ని నొక్కి చెప్పారు. కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు . పాఠశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదని హెచ్చ‌రించారు.
The post స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తేనే క‌లెక్ట‌ర్లుగా కొన‌సాగిస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జ‌గ‌న్ రెడ్డివ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలే : ప‌య్యావుల కేశ‌వ్జ‌గ‌న్ రెడ్డివ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలే : ప‌య్యావుల కేశ‌వ్

విజ‌య‌వాడ : టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలప లేదన్న వైఎస్సార్‌సీపీ వాదనలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్. ఆయ‌న శ‌నివారం మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర స్వామిపై

Fire Accident: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం ! ఆరుగురు సజీవ దహనం !Fire Accident: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం ! ఆరుగురు సజీవ దహనం !

    డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయవరంలోని గణపతి గ్రాండ్‌ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీనితో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు

అంగ‌రంగ వైభోగం ధ్వ‌జారోహ‌ణంఅంగ‌రంగ వైభోగం ధ్వ‌జారోహ‌ణం

తిరుపతి : తిరుపతి శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివ నామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధ మూర్తి, శ్రీ కామాక్షి అమ్మ వారు, శ్రీ