hyderabadupdates.com movies సాంప్రదాయిని రూటు మార్చుకోవడం రైటేనా

సాంప్రదాయిని రూటు మార్చుకోవడం రైటేనా

శివాజీ, లయ కాంబోలో తెరకెక్కిన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ముందు ప్రకటించిన ప్రకారమైతే ఇవాళ నుంచి ఓటిటిలో వచ్చేసి ఉండాలి. దానికి అనుగుణంగానే నిన్నటి దాకా ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చారు. అయితే ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూశాక నిర్ణయాలు మారిపోయాయి.

డిజిటల్ లో కాకుండా మార్చ్ 6 థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుని ఆ మేరకు అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. గతంలో ఇదే తరహాలో లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటివి థియేటర్లో సక్సెస్ అయ్యాకే ఓటిటిలో వచ్చిన నేపథ్యంలో సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఇదే బాట పట్టింది.

ఇది నిజంగానే అప్పటికప్పుడు అనుకుని డెసిషన్ మార్చుకున్నారా లేక ఒక ప్రణాళిక ప్రకారం మార్కెటింగ్ చేసుకుని వచ్చారా అనేది చెప్పలేం కానీ మొత్తానికి కొంత రిస్క్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే శివాజీ, లయ లాంటి సీనియర్ జంటను థియేటర్లో చూసేందుకు జనం అంత ఈజీగా రారు.

కంటెంట్ ఎక్స్ ట్రాడినరిగా ఉందంటే ఆడియన్స్ ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు లేదంటే టికెట్లు తెగడం కష్టం. ఈ మధ్య డీసెంట్ టాక్ వచ్చినా సరే శ్రీ చిదంబరం గారు, విత్ లవ్ లాంటివి వర్కౌట్ చేసుకోలేకపోయాయి. కానీ యూత్ ఎలిమెంట్స్ లేకుండా ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసుకున్న సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చేసేది సాహసమే.

ఇది మంచి ఫలితం ఇస్తే మటుకు ఇకపై ఇలాంటి తక్కువ బడ్జెట్ మూవీస్ ముందు థియేటర్లోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ప్రతిసారి హిట్టు రిజల్ట్ వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. ఏదైనా తేడా కొడితే మొదటి రోజు సాయంత్రానికే హాళ్లు ఖాళీగా ఉంటాయి.

గత ఏడాది పెద్ద హంగామా చేసిన మిత్రమండలి లాంటివి దీన్ని చవిచూశాయి. 90స్ మిడిల్ క్లాస్ లో బాగా ప్రాచుర్యం పొందిన బ్యాక్ గ్రౌండ్ లైన్ ని టైటిల్ గా పెట్టుకున్న సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని థియేట్రికల్ గా ఒక రెండు మూడు కోట్లు రాబట్టుకున్నా సేఫ్ గేమ్ అవుతుంది. దీంట్లోనే పవన్ కళ్యాణ్ మీద బండ్ల గణేష్ చేసిన సాంగ్ వైరలయ్యింది.

Related Post

వెయ్యి కోట్ల టార్గెట్ అంత ఈజీ కాదువెయ్యి కోట్ల టార్గెట్ అంత ఈజీ కాదు

దురంధర్ అంచనాలకు మించి దూసుకుపోతున్న మాట నిజమే. అఖండ 2 వచ్చాక స్లో అవుతుందనుకుంటే రివర్స్ లో నిన్న వీకెండ్ కూడా ఏపీ తెలంగాణలో చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. థియేటర్లు తక్కువ అందుబాటులో ఉండటంతో బయ్యర్లు షాక్ అయ్యేలా

క‌లిసిన పాత మిత్రులు: బాబు-తుమ్మ‌ల భేటీ!క‌లిసిన పాత మిత్రులు: బాబు-తుమ్మ‌ల భేటీ!

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు క‌లుసుకున్నారు. సోమవారం అమ‌రావ‌తికి వ‌చ్చిన తుమ్మ‌ల‌.. చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. వాస్త‌వానికి.. మైక్రోసాఫ్ట్ స‌హ వ్యవస్థాప‌కులు బిల్ గేట్స్ అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు