hyderabadupdates.com movies సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీడీపీలో చేరి ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామ…ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్నారు. అయితే, రఘురామపై సాక్షి మీడియా కథనాలు రాస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే సాక్షి మీడియా గ్రూపుపై చట్టపరమైన చర్యలకు రఘురామ రెడీ అయ్యారు.

తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని రఘురామ ఆరోపించారు. తన పరువు తీసేలా వరుస కథనాలు ప్రచురిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే ఇందిరా టెలివిజన్‌ ఎండీ భారతీరెడ్డి, ఎడిటర్‌, బ్యూరో చీఫ్, బోర్డ్ డైరెక్టర్లకు లీగల్ నోటీసులు పంపారు. తనకు బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, నష్ట పరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని, వాటిని అమరావతి రైతులకు ఇవ్వాలని లీగల్ నోటీసులో రఘురామ తరఫు న్యాయవాది ఉమేష్ చంద్ర పేర్కొన్నారు.

కాగా, అంతకుముందు రఘురామపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వర రాజు సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపించేందుకు రఘురామ కుట్ర పన్నారని ఆరోపించారు. తనను చంపాలని కుటుంబ సభ్యుల ఎదుటే అనుచరుడిని ఆదేశించారని ఆరోపించారు. సైకో ఎమ్మెల్యే రఘురామ నుంచి ఉండి నియోజకవర్గాన్ని కాపాడాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ లకు విజ్ఞప్తి చేశారు.

టీడీపీ నాయకులు, కార్యకర్తలను రఘురామ అసహ్యించుకుంటున్నారని, కొత్తపల్లి నాగరాజు సహకారంతో రఘురామ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రఘురామను ఎదిరించిన తనవంటి వారిపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ ప్రకారం సాక్షి మీడియాలో ఓ కథనం వెలువడింది. ఈ నేపథ్యంలోనే సాక్షి మీడియాకు రఘురామ లీగల్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.

Related Post

Dhandoraa Title Song Releases: A Fierce Anthem That Sets the Film’s Emotional FireDhandoraa Title Song Releases: A Fierce Anthem That Sets the Film’s Emotional Fire

With the release of its title song lyrical video, Dhandoraa sharpens the emotional and ideological pulse of its narrative. The song is not positioned as a celebratory opener or background

Hotel Costiera Serves Up a Cozy, Slightly Watered Down Heist CocktailHotel Costiera Serves Up a Cozy, Slightly Watered Down Heist Cocktail

Cozy mysteries are as addictive as cocktails because they require a specially crafted mix. The combination of sleuthing, everyday situations flipped into comedy, and the tease of ‘will they, won’t