hyderabadupdates.com Gallery సాయి సుద‌ర్శ‌న్ సెంచ‌రీ వృథా బెంగళూరు భ‌ళా

సాయి సుద‌ర్శ‌న్ సెంచ‌రీ వృథా బెంగళూరు భ‌ళా

సాయి సుద‌ర్శ‌న్ సెంచ‌రీ వృథా బెంగళూరు భ‌ళా post thumbnail image

బెంగ‌ళూరు : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు దుమ్ము రేపుతోంది. తాజాగా స్వంత గ‌డ్డ బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో స‌త్తా చాటింది. శుభ్ మ‌న్ గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ పై గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి చేరుకుంది. గుజ‌రాత్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా బ్యాటింగ్ కు దిగింది గుజ‌రాత్ టైటాన్స్. ఆ జ‌ట్టుకు చెందిన సాయి సుద‌ర్శ‌న్ , కెప్ట‌న్ శుభ్ మ‌న్ గిల్ ఆర్సీబీ బౌలర్ల‌ను ఉతికి ఆరేశారు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆక‌ట్టుకున్నారు. స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు.నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 205 ప‌రుగుల ల‌క్ష్యాన్ని బెంగ‌ళూరు ముందు ఉంచింది.
గుజ‌రాత్ టైటాన్స్ కు చెందిన ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ ఆర్సీబీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. త‌ను 58 బంతులు ఎదుర్కొని 100 ర‌న్స్ చేశాడు. ఇందులో 11 ఫోర్లు 5 సిక్సులు ఉన్నాయి. 3 వికెట్లు కోల్పోయి 20 ఓవ‌ర్ల‌లో 206 ర‌న్స్ టార్గెట్ నిర్దేశించింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన ఆర్సీబీ బ్యాట‌ర్లు రెచ్చి పోయి ఆడారు. ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ సూప‌ర్ షో చేశాడు. త‌ను కంటిన్యూగా ఫుల్ ఫామ్ కొన‌సాగిస్తూ వ‌స్తున్నాడు. త‌న‌కు అచ్చొచ్చిన మైదానంలో రెచ్చి పోయాడు. కేవ‌లం 44 బంతులు ఎదుర్కొని 81 ర‌న్స్ చేశాడు. 8 ఫోర్లు 4 సిక్సులు కొట్టాడు. దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ 27 బాల్స్ ఎదుర్కొని 55 ర‌న్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు 6 సిక్స్ లు ఉన్నాయి. ఈ ఓట‌మితో గుజ‌రాత్ టైటాన్స్ 7వ స్థానానికి ప‌డి పోయింది.
The post సాయి సుద‌ర్శ‌న్ సెంచ‌రీ వృథా బెంగళూరు భ‌ళా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

చంద్ర‌హాస్ బూతు పాటపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నెర్ర‌చంద్ర‌హాస్ బూతు పాటపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నెర్ర‌

హైద‌రాబాద్ : బ‌రా బ‌ర్ ప్రేమిస్తా మూవీ సంద‌ర్బంగా నిర్వ‌హించిన ఈవెంట్ లో సీరియల్ న‌టుడు ప్ర‌భాక‌ర్ త‌న‌యుడు చంద్ర‌హాస్ పాల్గొన్నాడు. త‌ను రాసి ఓ పాట పాడాడు. పూర్తిగా బూతుతో కూడుకుని ఉన్న‌ది. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంత‌రం వ్య‌క్తం

రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌

హైద‌రాబాద్ : అంద‌రి దృష్టి మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ , జాహ్న‌వి క‌పూర్ క‌లిసి న‌టించిన చిత్రం పెద్ది. దీనికి ఉప్పెన ఫేమ్ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ ఖ‌ర్చు పెట్టారు ఈ మూవీ కోసం.

వార్‌ 2..హిట్టే..తారక్‌ ఏంటంటే..!వార్‌ 2..హిట్టే..తారక్‌ ఏంటంటే..!

ఇటీవల ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైన సినిమాల్లో బాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “వార్ 2” కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించగా, ఇందులో హృతిక్ రోషన్‌తో పాటు మన తెలుగు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో