hyderabadupdates.com movies సింగర్స్ ని వాడుకోవడంలో మాస్టర్ డిగ్రీ

సింగర్స్ ని వాడుకోవడంలో మాస్టర్ డిగ్రీ

దర్శకుడు అనిల్ రావిపూడికి కామెడీ మీదే కాదు మ్యూజిక్ మీద కూడా మంచి పట్టుంది. స్టార్ హీరోలు లైట్ తీసుకునే భీమ్స్ సిసిరోలియోతో సంక్రాంతికి వస్తున్నాం రూపంలో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ చేయించుకోవడం అతనికే చెల్లింది. ముఖ్యంగా గోదారి గట్టు మీద రామచిలకవే సాంగ్ ఓపెనింగ్స్ లో కీలక పాత్ర పోషించదనడం అబద్దం కాదు. సినిమా రిలీజ్ కు ముందే లక్షల రీల్స్ రూపంలో ఆడియన్స్ కి రీచ్ అయిపోయింది. దీని కోసం ప్రత్యేకంగా ఎక్కడో ఉన్న రమణ గోగులని తీసుకొచ్చి పాడించడం మాములుగా పేలలేదు. వింటేజ్ వైబ్స్ ఫీలైన మ్యూజిక్ లవర్స్ అనిల్ రావిపూడికి బోలెడు థాంక్స్ చెప్పారు.

తాజాగా మన శంకరవరప్రసాద్ గారు కోసం బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ ని తీసుకొచ్చేశారు అనిల్ రావిపూడి. పాడే శక్తి ఉత్సాహం రెండూ ఉన్నప్పటికీ ఈ మధ్య ఈయన గొంతు హిందీలోనూ పెద్దగా వినిపించడం లేదు. మ్యూజిక్ కన్సర్ట్స్, సింగింగ్ షోలలో తప్ప దర్శనం జరిగితే ఒట్టు. అలాంటి సీనియర్ మోస్ట్ లెజెండరీని మరోసారి తీసుకొచ్చారు. ఒకప్పుడు 2000 టైంలో ఉదిత్ నారాయణ్ బోలెడు పాటలు పాడారు. ముఖ్యంగా మణిశర్మ కాంబినేషన్లో చార్ట్ బస్టర్స్ ఉన్నాయి. చూడాలని ఉంది, ఠాగూర్, సమరసింహారెడ్డి లాంటి వాటిలో ఎప్పటికీ గుర్తుండిపోయే సూపర్ హిట్ సాంగ్స్ ఎన్నో పాడారు.

ఇప్పుడు మీసాల పిల్ల అంటూ సాగే గీతం కోసం ఉదిత్ నారాయణ్ హైదరాబాద్ వచ్చారు. భీమ్స్ కంపోజ్ చేసిన మరో క్యాచీ ట్యూన్ వైరల్ అయ్యేలా ఉంది. ఫుల్ సాంగ్ రిలీజ్ చేయలేదు కానీ ఇది కూడా స్లో పాయిజన్ లా ఎక్కడం ఖాయం. చిరు గ్రెస్ తో డాన్స్ చేస్తుంటే రెండు కళ్ళు చాలడం లేదని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఉదిత్ నారాయణ్ ని తనదైన స్టైల్ లో ప్రమోషన్లకు వాడుకున్న అనిల్ రావిపూడి మరోసారి తన బ్రాండ్ పబ్లిసిటీ ఎలా ఉండబోతోందో శాంపిల్ చూపించేశారు. జనవరిలో సంక్రాంతి పండక్కు విడుదల కానున్న మన శంకరవరప్రసాద్ లో నయనతార హీరోయిన్ కాగా వెంకటేష్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

Related Post

మేఘాలయ అందాల్లో మునిగిపోతున్న ‘బా బా బ్లాక్ షీప్‌’మేఘాలయ అందాల్లో మునిగిపోతున్న ‘బా బా బ్లాక్ షీప్‌’

చిత్రాలయం స్టూడియోస్ నిర్మిస్తున్న క్రైమ్ కామెడీ సినిమా ‘బా బా బ్లాక్ షీప్‌’ షూటింగ్ మేఘాలయలో వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత వేణు దోనేపూడి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ చిత్రంలో టిన్ను ఆనంద్‌, ఉపేంద్ర లిమయే,

Modi Greets Rajinikanth on His 75th Birthday, Praises Five-Decade LegacyModi Greets Rajinikanth on His 75th Birthday, Praises Five-Decade Legacy

Prime Minister Narendra Modi extended warm wishes to superstar Rajinikanth on his 75th birthday, celebrating the legendary actor’s unmatched influence on Indian cinema. Modi said Rajinikanth’s performances have enthralled audiences